మళ్ళీ రెండు సినిమాలు…ఏమవుతుందో ?

0

టాలీవుడ్ ఫిలిం మేకర్ గా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ అందుకున్నాడు తేజ. కెరీర్ ఆరంభంలో తన సినిమాలతో హాట్ టాపిక్ గా మారిన తేజ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఆ మధ్య రానాతో తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్ళీ ఓ సూపర్ హిట్ కొట్టి ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక అక్కడి నుండి సరికొత్త తేజ ను చూడొచ్చని ఆశించిన ప్రేక్షకుల అంచనాలు తారుమారు చేస్తూ మళ్ళీ దర్శకుడిగా మళ్ళీ ఫెయిల్యూర్స్ అందుకున్నాడు.

తాజాగా వచ్చిన ‘సీత’ అనుకోని విధంగా అపజయం అందుకుంది. ఆ ఫ్లాప్ నుండి వెంటనే కోలుకొని మళ్ళీ రెండు కథలు రెడీ చేశాడు తేజ. ఒకటి రానా తో మరొకటి గోపీచంద్ తో తీయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన సన్నిహితుల తో కుదిరితే రెండు సినిమాలు ఒకే సారి తీస్తానని చెప్పుకుంటున్నారట. నిజానికి ఆ మధ్య ఇలాగే ఒకే సారి రెండు సినిమాలు ప్లాన్ చేసాడు తేజ.

ఒక వైపు వెంకటేష్ సినిమాను లాంచ్ చేసి మరో వైపు బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను కూడా హ్యాండిల్ చేయాలని చూసాడు. అయితే తేజ ప్లాన్ రివర్స్ అయింది. వెంకీ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోతే బాలకృష్ణ సినిమా నుండి ఆయనే తప్పుకొని క్రిష్ కి భాద్యతలు అప్పగించారు. సో ఇప్పుడు మళ్ళీ రెండు సినిమాలు ప్లాన్ చేసుకొని సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి ఈసారైన తేజ ప్లాన్ సవ్యంగా జరుగుతుందా ? చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-