హాట్ శిల్పం ఫోజులో ముద్దుగుమ్మ

0

తెలుగమ్మాయి తేజస్వి మడివాడ ఈమద్య సినిమాల్లో ఎక్కువగా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ అమ్మడు బిగ్ బాస్ కు ముందు సినిమాల్లో బాగానే కనిపిస్తూ ఉండేది. అంతో ఇంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుని కెరీర్ లో ముందుకు వెళ్లేది. కాని బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఈమె కెరీర్ బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల మలుపు తిరగకుండా పూర్తిగా యూ టర్న్ తిరిగిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలు.. వెబ్ సిరీస్ లు.. టీవీ షోలు ఇలా ఏ అవకాశం వచ్చినా నిరూపించుకునేందుకు సిద్దంగా ఉన్నాను అన్న విషయం చెప్పేందుకు అన్నట్లుగా ఈ అమ్మడు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలో శిల్పం మాదిరిగా ఫోజ్ ఇచ్చింది. లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా కూడా చూపించాల్సిన అందాలను చూపిస్తూ ఎక్స్ పోజింగ్ చేసింది. తెలుగు అమ్మాయి అయినా కూడా ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత విషయంలో వారితో పోటీ పడుతూ ఉంటుంది. ఈ తెలుగు శిల్పంకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారా చూడాలి.