రక్తకోలా కు రెడీ అయిన తెలుగు భామ!

0

తెలుగు బ్యూటీ తేజస్వి మదివాడ కెరీర్ మొదట్లో పర్వాలేదు అన్నట్టుగా కనిపించింది. చిన్న పాత్రలతో.. సైడ్ క్యారెక్టర్లతో కెరీర్ మొదలు పెట్టినా స్లోగా హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాలలో ఆర్జీవిగారి ‘ఐస్ క్రీమ్’ లు కూడా ఉన్నాయి. అయితే ఎందుకో కానీ తేజస్వి సినిమాలు పెద్దగా విజయం సాధించంకపోవడంతో కెరీర్ మందగించింది. ‘బిగ్ బాస్ 2’ లో పాల్గొని మళ్ళీ వార్తల్లోకి వచ్చింది కానీ ఆ గుర్తింపు హీరోయిన్ ఆఫర్లను తీసుకురాలేదు. అయితే తన కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తేజస్వి ఫుల్ యాక్టివ్. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

రీసెంట్ గా తేజస్వి అలానే ఒక స్పెషల్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. ఫ్రిల్స్ ఉండే వైట్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి.. పైన బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుంది. డ్రెస్ సూపర్.. ఇక చెవులకు పెట్టుకున్న వెడల్పాటి ఇయర్ రింగ్స్ కూడా డ్రెస్ కు మ్యాచ్ అయ్యాయి. అందాల వడ్డనలు.. గ్లామర్ ట్రీట్లు ఏమీ లేవు. అయితే ఈ ఫోటోలో అందరినీ వెంటనే ఆకర్షించే అంశం మాత్ర తేజస్వి లిప్ స్టిక్. డార్క్ పర్పుల్ కలర్ ను లిప్ ఔటర్ లైన్ దాటి మరీ వేసుకోవడంతో అందాల రాక్షసి లా కాకుండా రక్తపిపాసిలా.. పక్కా లోకల్ డ్రాకులాలా కనిపిస్తోంది.

లైకులు కొట్టకపోతే నెటిజన్లకు.. ఆఫర్లు ఇవ్వకపోతే ఫిలిం మేకర్లకు తన చేతిలో రక్త కోలా తప్పదని సింబాలిక్ గా చెప్పినట్టు ఉంది. తెలుగు భామలోని టాలెంట్ ను ప్రోత్సహించేవారే కరువయ్యారే! తన పేరు తేజస్వి అగర్వాల్ అనో.. తేజస్వి సింగ్ అనో మార్చుకుంటే కానీ ఆఫర్లు రావేమో మరి!!
Please Read Disclaimer