సాహో టికెట్లకు గేట్లు ఎత్తేశారు

0

టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫెస్టివల్ సాహోకు రంగం సిద్ధమయ్యింది. ఆన్ లైన్ బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే తిరుపతి లాంటి కీలక కేంద్రాలకు సంబంధించి ఉదయం 6 గంటల నుంచే షోల టికెట్లు అందుబాటులో ఉంచేయగా హైదరాబాద్ లో సైతం నాలుగైదు స్క్రీన్లకు సంబందించి అమ్మకాలు మొదలుపెట్టేశారు. అయితే తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం సాహో టికెట్ ధరల పెంపుకి కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే సానూకూలంగా స్పందించిందని తెలంగాణ తన పాత ధోరణికే కట్టుబడి ఉందని తెలుస్తోంది.

ట్విన్ సిటీస్ లో పెట్టిన బుకింగ్స్ లో సైతం పాత రేట్లే ఉండటం గమనార్హం. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సాహో ధరల పెంపుకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆ మేరకు మార్పుతోనే మరికొద్ది గంటల్లో సేల్స్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. బెనిఫిట్ షోల విషయంలోనూ ఏపీలోనే సానుకూల చర్యలున్నాయని తెలంగాణలో వేయడం డౌటేనని వినికిడి. దీనికి సంబంధించి క్లారిటీ ఇంకో రెండు మూడు రోజుల్లో రావొచ్చు. ఓపెనింగ్స్ లో బాహుబలి 2 ని టార్గెట్ చేసిన సాహో టాక్ కనక పాజిటివ్ గా అదేమంత పెద్ద అసాధ్యమేమీ కాదు.

పైగా పోటీ లేని వాతావరణం పెద్ద ప్లస్ అవుతోంది. ఇతర భాషల్లో పోటీ సినిమాలన్నీ పక్కకు తప్పుకుని డేట్లు మార్చుకోవడంతో అందరి దృష్టి సాహో మీదే ఉంది. ఇప్పుడీ ఆరు రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని అభిమానుల కంటే ఎక్కువగా థియేటర్ల యజమానులు ఎదురు చూస్తున్నారు. కిక్కిరిసిపోయే రద్దీతో తమ హాళ్లు కళకళలాడటం చూసి చాలా రోజులయ్యింది మరి. ఆ కరువునంతా సాహో వడ్డీతో సహా తీరుస్తుందని వాళ్ళ నమ్మకం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home