బిగ్ బాస్ హౌజ్‌లో వరుణ్ సందేశ్, వితికా రొమాన్స్ స్టార్ట్!!

0

ఒక బిగ్ హౌజ్. అందులో 15 మంది కంటెస్టెంట్లు. వాళ్ల మధ్య జరిగే యుద్ధం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. భావోద్వేగానికి గురిచేస్తుంది. రేపు ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఆసక్తిగొలిపే షోలో తొలి రోజు నుంచే ఎలిమినేషన్‌కు నామినేషన్లు మొదలయ్యాయి. హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి ముగ్గురు కంటెస్టెంట్స్‌(రవిక్రిష్ణ, శివజ్యోతి, అశు) బిగ్ బాస్ ఆదేశాల మేరకు మిగిలిన కంటెస్టెంట్లలో ఆరుగురుని ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు.

రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, వితికా షెరు, శ్రీముఖి, జాఫర్ బాబు సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పడంతో బిగ్ బాస్ ఈ ఆరుగురిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు. అయితే, ఈ ఆరుగురికి బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చారు. తొలిరోజు గడిచిన తరవాత నామినేట్ అయిన ఈ ఆరుగురు సరైన కారణం చెప్పి తమ బదులు మరొక హౌజ్‌మేట్‌ను ఎలిమినేషన్‌కు నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ సూచించారు. ఈ ఆరుగురు చెప్పే కారణాలు సరైనవేనా కావా నిర్ణయించడానికి మానిటర్‌గా హేమను ఉంచారు.

మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. అయితే, శివజ్యోతిని నామినేట్ చేయడానికి అతను చెప్పిన కారణం సరిగాలేదని హేమ నిర్ణయించింది. దీంతో బిగ్ బాస్ మళ్లీ రాహుల్‌నే నామినేట్ చేశారు. ఆ తరవాత వరుణ్ సందేశ్.. పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. వరుణ్ సందేశ్ చెప్పిన కారణం సరిగా ఉందని భావించిన హేమ ఆయన బదులు పునర్నవిని నామినేట్ చేసింది.

అనంతరం వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు.. అశురెడ్డిని నామినేట్ చేసింది. అయితే, వితికా షెరు తన కారణంతో హేమను కన్వెన్స్ చేయలేకపోయింది. దీంతో మళ్లీ ఆమెనే హేమ నామినేట్ చేసింది. జాఫర్ తన బదులు మహేష్ విట్టను నామినేషన్‌కు ఎంపికచేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆయన చెప్పిన కారణం సరైంది కాదని హేమ తేల్చేసింది. ఇక బాబా భాస్కర్‌ తనను తాను నామినేషన్ నుంచి బయట పడేసుకోవచ్చిన బిగ్ బాస్ వరం ఇచ్చారు.

హిమజ రచ్చ.. ఇవేం రూల్స్ అంటూ ఏడుపు 
ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన శ్రీముఖి తన బదులు హిమజను ఎంపిక చేసుకుంది. అయితే, శ్రీముఖి చెప్పిన కారణం హిమజకు ఆగ్రహం తెప్పించింది. హిమజ తనకు ఎప్పటి నుంచో తెలుసని, తాను ఎప్పుడూ రిజర్వ్‌గా ఉంటుందని శ్రీముఖి అన్న మాటలు హిమజను బాధించాయి. నా పర్సనల్ లైఫ్ గురించి నీకెలా తెలుసంటూ అంతెత్తున లేచిన హిమజ భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. దీంతో అక్కడ రచ్చ మొదలైంది. హేమ కూడా శ్రీముఖికి సపోర్ట్ చేయడంతో నేను నిందలు పడను అంటూ హిమజ గట్టిగా వాదించింది. రూల్స్ అందరికీ ఒక్కటేనంటూ అరిచింది. కానీ, హేమ మాత్రం శ్రీముఖి బదులుగా హిమజనే ఎలిమినేషన్‌కు నామినేట్ చేసింది. 

మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియలో ముగ్గురు పాత వాళ్లు మిగిలి మరో ముగ్గురు కొత్తవాళ్లు తోడయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌కు రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలను నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ఖరారు చేశారు. 
Please Read Disclaimer