విన్నర్‌గా వితికా.. దేవుడున్నాడు చూస్తాడన్న శ్రీముఖి

0

ఏమాటకామాటే కాని.. బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి చేస్తున్న సందడే వేరు. లౌడ్ స్పీకర్ అంటూ ఆమెపై ట్రోల్స్ పేలుతున్నా.. హౌస్‌లో ఉదయాన్ని బిగ్ బాస్ ప్లే చేసే సాంగ్‌కు శ్రీముఖి వేసే స్టెప్పులు కిక్కే వేరు. పొట్టి నిక్కరుతో అట్రాక్ట్ చేస్తూ తాను చిందులు వేయడమే కాకుండా మిగతా కంటెస్టెంట్స్‌‌తోనూ చిందులు వేయిస్తుంది. ఇక ఆమెకు బాబా భాస్కర్ తోడు కలిశాడంటే టాప్ లేచిపోవాల్సింది. నేటి ఎపిసోడ్ ప్రభుదేవా ముక్కాబులా సాంగ్‌కి రాహుల్, అలీలతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది శ్రీముఖి.

ప్రస్తుతం 11వ వారంలో 9 మంది కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ ఆట ఆసక్తికరంగా మారింది. ఈవారం నామినేషన్స్‌లో నలుగురు రాహుల్, పునర్నవి, మహేష్, వరుణ్‌లు ఉండటంతో ఆట మరింత రంజుగా మారింది.

హౌస్ పరిస్థితులు చూస్తే.. బాబా కిచెన్‌లో గరిటె తిప్పే పనిలో బిజీగా ఉంటే.. రాహుల్ ఇంటి సభ్యుల గురించి ‘ఏందిరో.. ఏందిరో’ అంటూ పాట అందుకున్నాడు. మహేష్‌ని నోటి దూల అంటూ పాట పాడగా.. నాకు కాదురా హౌలే నీకు నోటి దూల నాగార్జున నాలుగు సార్లు తిట్టారు అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు.

మరోవైపు శ్రీముఖి గురించి రాహుల్, వరుణ్, వితికా, అలీ, పునర్నవిలు గుసగుసలాడారు. ఆమె హౌస్‌లో చేసే ప్రతి పని గేమ్‌లో భాగమే అని ఆరోపణలు చేశారు.

కుళాయి కొట్లాట..
బ్యాటిల్ మెడాలియన్ మొదటి లెవల్‌లో ఈవారం ఇంటి సభ్యుల కోసం.. కుళాయి కొట్లాట అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో వితికా, శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీలు మాత్రమే పోటీ దారులుగా ఉన్నారు. ఇక టాస్క్ టాస్క్ ఇచ్చినా ఎలాగూ పునర్నవి పెర్ఫామ్ చేయదు అనుకున్నారో ఏమో కాని.. బిగ్ బాస్ పునర్నవిని సంచాలకులుగా ఉండమన్నారు. టాస్క్ ప్రకారం ట్యాప్‌ల నుండి బకెట్‌లలో నీళ్లు పట్టుకుని డ్రమ్స్‌ నింపాల్సిఉంటుంది. గేమ్‌లో లేని రాహుల్, మహేష్, వరుణ్‌లు వీళ్లకు సాయం చేయవచ్చు లేదా.. నీళ్లు నింపకుండా అడ్డుకుని కిందా మీదా ఎప్పట్లాగే దొర్లొచ్చని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

హౌస్‌లో రెండే టాప్‌లు ఉండటంతో ఒక ట్యాప్ శ్రీముఖి, శివజ్యోతి, వితికాలు వాటర్ పట్టుకునేందుకు పోటీపడ్డారు. ఇక బాబా భాస్కర్ వాటర్ పట్టుకోకుండా వరుణ్ సందేశ్ అడ్డుపడటంతో వివాదం రేగింది. సంచాలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. అనంతరం అలీ, శ్రీముఖిల మధ్య రచ్చ రేగింది. అలీ తన గేమ్ తను ఆడకుండా.. తన అక్క శివజ్యోతికి హెల్ప్ చేస్తుండటంతో అభ్యంతరం చెప్పింది శ్రీముఖి.

నీ ఆట నువ్ ఆడటం మానేసి శివజ్యోతికి హెల్ప్ చేయడం ఏంటి? ఆమె కోసం టైటిల్ వదిలేస్తావా అంటే అవును వదిలేస్తా అన్నాడు అలీ. ఎలిమినేషన్ అప్పుడు బాగా ఏడ్చిందన్న కృత‌జ్ఞతతో అలీ తన ఆటను సైతం పక్కనపెట్టేసి శివజ్యోతి కోసం గేమ్ ఆడుతున్నాడు అలీ. దీంతో ఇది కరెక్ట్ కాదు అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ సీరియస్ అయ్యారు. సంచాలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకుని అలీ నీ ఆట నువ్ ఆడాలని కోరడంతో అలీ వినలేదు. దీంతో బిగ్ బాస్‌కి కంప్లైంట్ చేసింది పునర్నవి.

ఒకరి కోసం ఒకరు గేమ్ ఆడితే ఇంకెందుకని ఈ గేమ్ మేం ఆడము అంటూ వితికా తెగేసి చెప్పడంతో.. ఎవరు ఫెయిర్‌గా గేమ్ ఆడుతున్నారో ఆడియన్స్ చూస్తున్నారని వచ్చే వారం నాగార్జున వచ్చి విషయం తేలుస్తారు. దేవుడనేవాడు ఉన్నాడు చూస్తాడు, నేను నా ఆట ఆడుతా అంటూ శ్రీముఖి సీరియస్ అయ్యింది.

ఇక చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అలీ, శివజ్యోతిలు నియమాలను ఉల్లంఘించారని అందుకే ఈ ఇద్దర్నీ టాస్క్‌ నుండి డిస్ క్వాలిఫై చేశారు. కంగుతున్న శివజ్యోతి ఏడ్వలేదు కాని.. తమ్ముడి తన కోసం త్యాగం చేస్తాడనుకుంటే బిస్కెట్ అయ్యిందని బాధపడింది. ఫైనల్‌గా ‘కుళాయి కొట్లాట’ టాస్క్‌‌లో ఎక్కువ నీటితో టబ్‌ నింపిన వితికా విన్నర్‌గా నిలిచింది. దీంతో బ్యాటిల్ మెడాలియన్‌కు డైరెక్ట్‌గా ఎంపిక అయ్యింది వితికా. మొత్తంగా పునర్నవి సంచాలకత్వంలో వితికా విన్నర్ అయ్యింది.
Please Read Disclaimer