క్రిస్మస్ బరిలో గెలుపెవరిది…?

0

తెలుగు సినిమాలకు సంక్రాంతి – దసరా సీజన్ల తర్వాత చెప్పుకోదగ్గ సీజన్ క్రిస్మస్. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సీజన్ కి ఒకటో – రెండో సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ సీజన్ అక్కినేని ఫ్యామిలీకి బాగా అచొచ్చిన సీజన్. గతంలో ఈ సీజన్ లో రిలీజ్ అయిన అక్కినేని సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కానీ ఈ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీ నుండి ఏ హీరో సినిమా ఈ క్రిస్మస్ కి రిలీజ్ కావట్లేదు. కానీ ఈ క్రిస్మస్ కి కూడా మంచి అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

రవితేజ హీరోగా వస్తున్న సినిమా ‘డిస్కో రాజా’ – నితిన్ హీరోగా ‘భీష్మ’ – సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలు ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్ లో విడుదల అవుతున్నాయి. ఈ ముగ్గురు హీరోలు వరుస ప్లాప్ లతో ఉన్నారు. వీళ్ళకి వెంటనే ఒక హిట్ కావాలి. మరి ఈ క్రిస్మస్ వాళ్ళకి హిట్ ఇస్తుందో… లేదో… చూడాలి. అంతేకాకుండా అనుష్క మెయిన్ రోల్ చేస్తున్న ‘నిశ్శబ్దం’ కూడా ఈ డిసెంబర్ లోనే విడుదల చేస్తారని అనుకుంటున్నారు. బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ఈ సీజన్ లోనే వస్తుంది అని సమాచారం. మరి ఈ సినిమాలలో ఏ సినిమా క్రిస్మస్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.
Please Read Disclaimer