తెలుగమ్మాయికి ప్రపోజల్స్

0

చీరలో సింగారం .. అందులో ఈ తెలుగమ్మాయి ఎక్స్ పర్ట్. అయినా ఇలా చీరలో కవ్విస్తే ఇంకేమైనా ఉందా? బోయ్స్ హర్రీ అయిపోరూ.. కలత నిద్రతో కంటికి కునుకే కరువై పరేషానవుతున్నారు! అయినా ఈ హైదరాబాదీ మిస్ కి ఏమాత్రం కనికరం అన్నదే లేదు. నిరంతరం ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు సామాజిక మాధ్యమాల వేదికగా ఏదో ఒక కొత్త ఫోటో షూట్ తో ముందుకు వస్తూనే ఉంది ఈషా రెబ్బా.

తారక్ `అరవింద సమేత` చిత్రంలో నటించింది మొదలు.. కెరీర్ ని తెలివిగా ప్లాన్ చేసుకున్న ఈష సెలక్టివ్ గానే సినిమాల్లో నటిస్తూ ముందుకు వెళుతోంది. అంతకు ముందు ఆ తర్వాత- బందిపోటు-అమీ తుమీ-అరవింద సమేత వీరరాఘవ .. ఇలా కెరీర్ గ్రాఫ్ బాగానే ఉంది. అందానికి అందం అభినయం ఉన్న నటి కాబట్టే అవకాశాలకు కొదవేమీ లేదు. అందంతో పాటు నటించే సత్తా ఉన్న ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన సినిమాగాని.. పూర్తి స్థాయి వేషం గానీ దక్కలేదని అభిమానుల్లో అసంతృప్తి ఉంది.

అయితే ఎప్పటికప్పుడు ఇదిగో ఇలా సంథింగ్ హాట్ ఫోటోలతో తనలోని రూపలావణ్యాన్ని అభిమానుల ముందు ప్రదర్శిస్తోంది. అవసరం అయితే బాండ్ గాళ్ గా మారిపోయేంత మోడ్రన్ స్టైల్ అప్పియరెన్స్ తనకు ఉందని గత ఫోటోషూట్లు చెప్పాయి. మన దర్శకనిర్మాతలు.. రచయితలు చూసే కోణాన్ని బట్టి ఏ రూపంలోకి అయినా మారిపోయే సత్తా ఈ తెలుగమ్మాయి ఉంది మరి. మరి ఆ తరహా పాత్రలు తనని వెతుక్కుంటూ వస్తాయా? అన్నది చూడాలి. అంతవరకూ .. ‘మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది.. మాటలు రావె ఇలా.. !’ అంటూ బోయ్స్ సన్నివేశమే ఏమిటో ఏదోలా ఉంది.
Please Read Disclaimer