ఈ ఏడాదికి నో షూటింగ్.. తెలుగు హీరోల నిర్ణయం?

0

కొన్ని వారాల క్రితం టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు షూటింగ్కు సంబంధించిన అనుమతుల కోసం వరుసగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కలిశారు. చాలా రోజులు చర్చలు జరిపి అనేక నిబంధనలతో షూటింగ్ లకు అనుమతులు సాధించారు. అయితే ఎప్పుడైనా అనుమతులు వచ్చాయో అప్పటి నుంచి దేశం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసుల తీవ్రత పెరగడంతో షూటింగ్ మొదలు పెట్టడానికి అగ్రహీరోలు దర్శకులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ షూటింగ్ మొదలు పెట్టడానికి వెనుకంజ వేశారు. కరోనావైరస్ తీవ్రత తగ్గినప్పుడే షూటింగ్ను తిరిగి ప్రారంభిస్తామని వారు నిర్ణయించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టెస్ట్ షూట్ ను చేద్దామని నిర్ణయించుకొని మరీ ఎస్ఎస్ రాజమౌళి రద్దు చేశారు. అదేవిధంగా స్టార్ హీరో వెంకటేష్ తాజాగా తన కొత్త సినిమా నరప్ప షూటింగ్ జరపవద్దని డిసైడ్ అయ్యారు.. మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య సినిమాను ఇప్పట్లో ప్రారంభించే యోచనలో లేరు.

ఇప్పటికే సెట్స్లో ఉన్న కొన్ని సినిమాలు మాత్రమే పూర్తి చేస్తున్నారు. కొత్తగా ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారిపాట’ వాయిదా వేయడానికే నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ విజయ్ అజిత్ సూర్య తదితరులు 2020 సంవత్సరాన్ని మిస్ అవ్వబోతున్నామని ప్రకటించారు. ఈ సంవత్సరం వారు షూటింగ్ చేయమని తీర్మానం చేసుకున్నారు. ఇక సినిమాలు కూడా విడుదల చేయమని డిసైడ్ అయ్యారు. అందరూ 2021 లో తిరిగి పని ప్రారంభిస్తామని తెలిపారు. అదీ కరోనా తగ్గితేనే..

తెలుగు తారలు కూడా తమిళ హీరోలను ఫాలో అవ్వాలని అనుకుంటున్నట్టు ఉన్నారు. చాలా మంది టాలీవుడ్ హీరోలు షూటింగ్ ను వాయిదా వేస్తున్నారు. రాబోయే కొద్ది నెలల్లో షూటింగ్ లేకపోతే మరో ఆరు నెలల వరకు సినిమాలు ఉండవని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా సగం పూర్తయిన సినిమాలే పరిస్థితిని బట్టి ఇప్పుడు పూర్తి చేస్తున్నారు.
Please Read Disclaimer