చీరలో సంపుతున్న తెలుగందం!

0

తెలుగు సినీ పరిశ్రమలో అచ్చతెలుగు హీరోయిన్లు తక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. హబుల్ టెలిస్కోప్ పెట్టి గాలించినా ఒక్క హీరోయిన్ కూడా కనపడరు. అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా హీరోయిన్ గా కొనసాగుతూ అందరినీ మెప్పిస్తున్న భామ ఈషా రెబ్బా. కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నప్పటికీ ఇంకా ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతోంది. అయితే అవేమీ పట్టించుకోకుండా ఇతర బ్యూటీల తరహాలో గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తూ నార్త్ భామలకు తానేమీ తీసిపోనని నిరూపిస్తూ ఉంది.

రీసెంట్ గా ఈషా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. లైట్ కలర్ లో ఉండే స్లీవ్ లెస్ డిజైనర్ బ్లౌజ్ ధరించి గోల్డ్ నెక్లెస్.. వెడల్పాటి చెవి కమ్మలు ధరించి అందంగా పోజిచ్చింది. మేకప్ కొంచెం డిఫరెంట్ గా చెయ్యడంతో ఈషా చర్మంలో ఒక మెరుపు కనిపిస్తోంది. ఈషా మొహంలో అలాంటి మెరుపు ఉంది. ముత్యాల్లాంటి పలువరుస చూస్తుంటే.. ఆ టూత్ పేస్ట్ యాడ్లకు ఈషాను తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందనిపిస్తోంది. ఇంత హాటుగా ఉన్న తెలుగు భామను మన ఫిలిం మేకర్లు ఎందుకు పెద్దగా పట్టించుకోవడం లేదో.

ఈషా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాగల 24 గంటల్లో’ రేపు శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాలో ఈషా ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా కాకుండా ఈషా రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో నటించేందుకు రెడీ అయింది. లస్ట్ స్టోరీస్ అంటేనే బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్. తెలుగులో ఆ డోస్ ఎంత తగ్గించినప్పటికీ ప్రేక్షకులకు షాక్ కొట్టడం ఖాయమే. మరి ఈ తెలుగు లస్ట్ స్టోరీస్ తో అయినా ఈషా కెరీర్ కు మంచి బూస్ట్ వస్తుందేమో వేచి చూడాలి.