బండ్ల గణేష్ అరెస్ట్

0

ఒక నిర్మాతను బెదిరించిన కేసులో బండ్ల గణేష్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 420 – 448 – 506r/w – 43 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి తనను బెదిరించారని వైసీపీ నేత – సినీ నిర్మాత అయిన పీవీపీ కేసు పెట్టారు. ముందు జూబ్లీహిల్స్ పోలీసులు బండ్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత. ఆ సినిమాకు గణేష్ వరప్రసాద్ నుంచి 30 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు. ఆ సినిమా బాగానే ఆడింది. అయినా అప్పట్లో కొంత మొత్తమే తిరిగి చెల్లించారట బండ్ల. తర్వాత మిగతా డబ్బుల కోసం పీవీపీ అనేక సార్లు బండ్లను సంప్రదించినా ప్రయోజనం లేదని పీవీపీ ఆరోపించారు. చివరకు డబ్బులు ఇవ్వమని గట్టిగా ఒత్తిడి తెస్తే అనుచరులతో వచ్చి బెదిరించినట్లు బండ్ల గణేష్ పై పీవీపీ ఆరోపణలు చేశారు. అదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బండ్ల కేసు నమోదు అనంతరం కనిపించలేదు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు అందుబాటులోకి వచ్చారు. పోలీసులు బండ్లను విచారించారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం దీనిపై ఒక ఆన్ లైన్ యుద్ధం కూడా నడిచింది.
Please Read Disclaimer