నాని నా అసిస్టెంట్.. హీరో అయ్యాక నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

0

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు లక్ కూడా కలిసి రావాలి. ఈ రెండు కలిసి వస్తే.. ఆయా రంగాల్లో టాప్ పొజిషన్‌లో ఉంటారు. కలిసి రాని వాళ్లు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తమ కెరియర్‌ను ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఉంటారు. అయితే తమ ముందు తమతో పాటు జర్నీ చేసిన వాళ్లు స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు అయిపోతుంటే మనం మాత్రం ఇక్కడే ఉన్నాం అనే ఫీల్‌తో పాటు.. ఎదుటి వారి రిసీవింగ్ కూడా బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు డైరెక్టర్ ఏటా సత్యనారాయణ.

రాఘవేంద్రరావు కోడైరెక్టర్ ఏట సత్యనారాయణ.. దర్శకుడిగా పలు హిట్ సీరియల్స్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర కో డైరెక్టర్‌గా శిష్యరికం చేసిన ఈయన.. మనోయజ్ఞం, త్రిశూలం, స్వర్ణఖడ్గం వంటి సూపర్ హిట్ సీరియల్స్‌ను డైరెక్ట్ చేశారు. ఈయనతో పాటే పనిచేశారు టాలీవుడ్ గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి. ఆయనతో పాటు నేటి స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని.. ఏట సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నానితో ఆయనకు ఉన్న అనుబంధం ఆ తరువాత ఏం జరిగిందన్న విషయాన్ని తెలియజేశారు ఏట సత్యనారాయణ.

నాని హీరో అయ్యాక.. ఆయన రిసీవింగ్ నచ్చలేదు

అప్పట్లో ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆశలు ఉండకూడదు.. ఆశయాలకు ఎండ్ ఉండకూడదనే తత్వం నాది. ఎప్పటికప్పుడు అన్నీ మారుతూ ఉండాలి. నాతో పాటు పనిచేసిన నాని విషయానికి వస్తే.. నాని స్టార్ అయ్యాడు కాబట్టి ఆయన్ని కలవడం కుదరలేదు. ఆయన హీరో అయిన తరువాత ఒకటి రెండుసార్లు ట్రై చేశా. ఆయన రిసీవింగ్ సరిగా అనిపించలేదు. ఎవరి బలుపు వాళ్లకి ఉంటుంది. అది నేను తప్పు అనుకోను. ఎందుకంటే నాని ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు. అతనితో సినిమా చేయాలంటే నేను తగ్గాలి. తగ్గాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నానితో పోల్చుకుంటే అసలు నేను ఎంత?

అల్లరి బుల్లోడు సినిమాకి నేను కో డైరెక్టర్.. నాని అసిస్టెంట్.. ఆ టైంలో!!

ఒకప్పుడు నాని నాకు అసిస్టెంట్‌గా పనిచేశాడని కూడా అనలేం ఇప్పుడు. ఎందుకంటే మేం ఇద్దరం కలిసి పనిచేశాం. తను అసిస్టెంట్, నేను కో డైరెక్టర్. ఇద్దరం కలిసి నితిన్ హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి పనిచేశాం. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. నేను కో డైరెక్టర్, నాని అసిస్టెంట్. మేం ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా కలిసి పనిచేశాం. ఏరోజు కూడా తనను నేను ఒక్క మాట అనడం కాని.. అతను నన్ను ఏమైనా అనడం కాని జరగలేదు.

సీరియర్ల డామినేషన్ ఉంటుంది కాని.. నేను నానితో అలా ఉండలేదు

సినిమా ఫీల్డ్‌లో సీరియర్స్ డామినేషన్ ఉంటుంది. అలా నేను అతన్ని నేను డామినేట్ చేయడం కాని.. అతను నా మాట వినకపోవడం కాని లేవు. జిరాక్స్‌కి వెళ్లాలంటే ఇద్దరం కలిసి అతని బైక్ పైనే వెళ్లేవాళ్లం. అలాంటి ఇన్సిడెంట్ మా మధ్య చాలానే ఉన్నాయి. ‘అల్లరి బుల్లోడు’ సినిమా తరువాత నందినీ రెడ్డి గారి నుండి నానికి ఆఫర్ వచ్చింది. నాని వాళ్ల బాబాయ్ అనీల్ ఆ సినిమాకి ప్రొడ్యుసర్. నానికి హీరో ఆఫర్ రావడంతో మేం సరదాగా ఆటపట్టించేవాళ్లం. మనం ఇలాగే ఉన్నాం.. నాని హీరో అయిపోతున్నాడు అని. ఆ సినిమా ఎందుకో వెనక్కి వెళ్లింది.

విష్ణు సినిమాకి అసిస్టెంట్‌గా నాని.. సునీల్ ఇప్పించారు ఆ ఆఫర్

ఆ తరువాత కమెడియన్ సునీల్.. విష్ణు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీగా ఉంది చేస్తావా? అని నానిని అడిగాడు. నేను నాని, సునీల్ మాట్లాడుకుని విష్ణు సినిమాకి పనిచేశారు నాని. ఆ సినిమా అప్పుడు కూడా నాని నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. సార్.. విష్ణు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేవాడు. తాజ్ హోటల్‌కి తీసుకునివెళ్లారు విష్ణు అని చెప్పారు.

30 వేల జీతానికి నాని.. సినిమాలు వదిలేసి రేడియో జాకీగా

మధ్యలో నానికి నాకు మధ్య గ్యాప్ వచ్చింది. అయితే నా పెళ్లికి నానికి చెప్పడం, వాళ్ల సిస్టర్ పెళ్లికి నాకు చెప్పడం లాంటివి జరిగాయి. మధ్యలో నేను ఫోన్ చేసినప్పుడు నాని ఫోన్ కలిసేది కాదు.. దీంతో మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్‌గా ఉన్న కాకర్ల శ్రీనివాస్ (బాపు గాడి కో డైరెక్టర్) నాని సినిమాలు మానేసి రేడియో జాకీగా వెళ్లారని చెప్పారు. అదేంటి ఎందుకు అటు వెళ్లారని అనగా.. అక్కడ రూ.30 వేలు ఇస్తున్నారని కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని మళ్లీ సినిమాలకు వస్తానన్నాడని చెప్పారు.

నాని హీరో అయ్యాడని పేపర్‌‌లో చూశా.. ఫోన్ చేస్తే!!

కొన్నాళ్ల తరువాత పేపర్‌లో ‘అష్టా చెమ్మ’ ఫోటో చూశా. చాలా షాక్ అయ్యా. నాని హీరో అయ్యాడని చూసి వెంటనే ఫోన్ చేశా.. కాని ఫోన్ కలవలేదు. ఇక సినిమా విడుదలైన తరువాత సినిమా చూసి నానికి ఫోన్ చేశా అభినందించా. చాలా బాగా మాట్లాడాడు. 20 నిమిషాలకు పైగా మాట్లాడాడు. మధ్యలో అనుకోకుండా ఇద్దరం ఒకటి రెండు సార్లు కలిశాం.

నాని ఓ మెసేజ్ పెట్టా.. ఏమని అంటే..

నేను రాంగో.. అతను రాంగో తెలియదు కాని.. ఎందుకో పరిస్థితి తేడాగా అనిపించింది. ఆ తరువాత నేనే కరెక్ట్ కాదేమో అనుకుని మళ్లీ నేను నానికి మెసేజ్ పెట్టా. ‘నాని.. నా పరిస్థితి నీకు తెలుసు.. నేను ఆర్థికంగా స్థిరపడటానికి సినిమా ఇండస్ట్రీకి రాలేదు. నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. సినిమా ప్రయత్నం చేస్తున్నాను.. ఇక సినిమాలవైపే రావాలని అనుకుంటున్నాను.. నువ్ టైం ఇస్తే ఓ 5 నిమిషాలు మాట్లాడాలి’ అని మెసేజ్ పెట్టా. వాట్సాప్‌లో బ్లూటిక్ వచ్చింది కాని.. అవతల నుండి రెస్పాన్స్ లేదు. ఆ మెసేజ్ ఆయన చూశాడో.. లేక తన అసిస్టెంట్ చూశాడా అన్నది నాకైతే తెలియదు కాని.. మెసేజ్ అయితే చూశారు.

కారణం ఏమై ఉంటుందో.. మీరే అర్ధం చేసుకోండి

నాని ఫోన్ కొన్న దగ్గర నుండి ఇప్పటి వరకూ ఒకటే నెంబర్. ఇప్పటికీ మార్చలేదు. అయితే మళ్లీ మెసేజ్ పెట్టా.. ఈాసారి నా మెసేజ్ అతనికి రీచ్ కాలేదు. రీచ్ కాలేకపోవడానికి కారణం ఏమై ఉంటుందన్నది ఊహించుకోవచ్చు. అయితే చెడుగాను అనుకోవచ్చు.. మంచిగాను అనుకోవచ్చు.

ఆయన్ని నాని గాడ్ ఫాదర్‌గా భావిస్తారు.. అతనికే సినిమా ఛాన్స్ ఇవ్వలేదు

బహుషా నాని నాతో సినిమా చేస్తే అంతకు ముందు పిలిచినట్టు నన్ను ఏటగారూ… సార్ అని పిలవాలి. పైగా అతను స్టార్ అయ్యాడు. కొత్త కొత్త హీరోయిన్లను, హీరోలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నేను చెప్పింది వినాలి అంటే అతనికి కూడా ఇబ్బందిగా అనిపించి ఉండవచ్చు. అయితే నాకొక ఆన్సర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. నేను ఎక్కువగా ఆలోచించింది ఏంటంటే.. బాపు గారి కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని గాడ్ ఫాదర్‌లా భావిస్తారు నాని.. ఆయనకు కూడా అవకాశం ఇవ్వలేదు కదా.. దీన్ని బట్టి నాని మైండ్‌లో ఏదో ఉండి ఉంటుంది. లేకపోతే అతనికైనా సినిమా ఛాన్స్ ఇచ్చి ఉండేవాడు కదా.

నేను నానిని నమ్ముకుని ఇండస్ట్రీకి రాలేదు. నన్ను నేను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చా

సో.. అప్పటి నుండి నాని ఆలోచన వేరేలా ఉండి ఉంటుందని అనుకున్నా. అందుకే నాని నాతో మాట్లాడిన తరువాత వద్దు అని చెప్పడం కంటే ముందే దూరం పెడితే సరిపోతుందని ఇలా చేసి ఉంటాడని అనుకున్నా. అప్పటి నుండి నాని వైపుగా ప్రయత్నాలు మానేశా. అలాగని నానిపై నెగిటివ్ ఫీలింగ్ లేదు. నాని ఎప్పుడైనా బాధపడినట్టుగా కనిపిస్తే.. నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే అంత మంచి రిలేషన్ మాది. మనవాడు అనే అనుకుంటాను. నేను నానిని నమ్ముకుని ఇండస్ట్రీకి రాలేదు. నన్ను నేను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చా’ అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ ఏటా సత్యనారాయణ.
Please Read Disclaimer