మగువ పాత్రల్లో టాప్ స్టార్స్

0

కెరీర్ లో ఎన్ని విలక్షణమైన పాత్రలతో మెప్పించినా లేడీ గెటప్ అనేది కాంప్లికేటెడ్. అలాంటి ఛాలెంజ్ స్వీకరించాలంటే గట్స్ ఉండాలి. మేల్ డామినేషన్ తగ్గించి ఫీమేల్ ఆహార్యంతో సున్నితమైన లాలిత్యాన్ని ఒలికించాల్సి ఉంటుంది. అమ్మాయిలా కళ్లతోనే కోటి భావాలు పలికించాలి. బాడీ లాంగ్వేజ్ లో ఛేంజోవర్ చూపించాలి. అయితే అలాంటి సవాల్ ని స్వీకరించిన టాలీవుడ్ స్టార్లు ఎందరు ఉన్నారు? అన్నది ఆరాతీస్తే పలువురి పేర్లు పాపులరయ్యాయి.

టాలీవుడ్ సీనియర్ కథానాయకులు చిరంజీవి – బాలకృష్ణ- వెంకటేష్- రాజేంద్ర ప్రసాద్ ఈ తరహా పాత్రల్లో నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ డ్యాన్సుల్లోనే కాదు ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి డిఫరెంట్ ఆహార్యంతో మెప్పించారు. అందులో లేడీ గెటప్ తోనూ ప్రూవ్ చేశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన `చంటబ్బాయి` చిత్రంలో లేడీ గెటప్ తో అలరించారు. ఆ వేషంలో టింజ్ చూసి థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకున్నారు ఆడియెన్.

వేషధారణల పరంగా ప్రయోగాలు చేయడంలో ఇండియాలోనే ది బెస్ట్ స్టార్ గా విశ్వనటుడు కమల్ హాసన్ కి పేరుంది. భామనే సత్యభామనే చిత్రంలో భామగా అద్భుతమైన నటనతో మైమరిపించారు. దశావతారంలోనూ లేడీ గెటప్ లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంథిరన్ (రోబో) చిత్రంలో ఓ పాటలో లేడీ గెటప్ తో అలరించారు. రొటీనిటీకి భిన్నంగా రజనీ చేసిన కామెడీ ఆశ్చర్యపరిచింది.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నట వైదుష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కెరీర్ లో చేయని ప్రయోగం లేదు. మేడమ్- వివాహ బోజనంబు- ఆల్ రౌండర్ చిత్రాలలో లేడీ గెటప్పులతో మెప్పించారు. నటవైవిధ్యం ఆయన ప్రతిసారీ చూపించే ప్రయత్నం చేశారు. సీనియర్ నరేష్ `చిత్రమ్ భళారే విచిత్రమ్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో లేడీ గెటప్ తో అలరించారు. నాన్ స్టాప్ కామెడీ ఎంటర్ టైనర్ `జంబలకిడి పంబ` చిత్రంలోనూ సీనియర్ నరేష్ లేడీ గెటప్ బిగ్ ట్రీటిచ్చింది. నరేష్ కెరీర్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆ రెండూ. యముడికి మొగుడు చిత్రంలో అల్లరి నరేష్ లేడీ గెటప్ కామెడీ ఆకట్టుకుంది.

నటసింహా నందమూరి బాలకృష్ణ లేడీ గెటప్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. పాండురంగడు చిత్రంలో సత్యభామగా లేడీ గెటప్ లో నటించారు. పక్కా మాస్ స్టార్ ఈ తరహా గెటప్ తో కనిపించడం ప్రేక్షకులందరినీ మంత్రముగ్దులను చేసింది. నవతరంలో మంచు మనోజ్ ఇలాంటి ప్రయోగం చేశాడు. `పాండవులు పాండవులు తుమ్మెదా` చిత్రంలో మోహిని గెటప్ తో కనిపించాడు. సుమంత్ `ఏమో గుర్రం ఎగురవచ్చు` మూవీలో చీరకట్టుతో అమ్మాయిగా మారి వయ్యారాలు పోతూ డ్యాన్స్ చేసాడు. అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రి లో లేడీ వేషధారణతో కనిపించారు. ఆరంగేట్రమే తనకు ఇదో ప్రయోగం అనే చెప్పాలి. టాలీవుడ్ కమెడియన్ అలీ ఎన్నో చిత్రాల్లో చీరకట్టు లేడీ గెటప్ తో నవ్వించారు.
Please Read Disclaimer