ప్రెగ్నెంట్ గా తెనాలి బ్యూటీ

0

తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ మొదట్లో మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సీరీసులలో నటిస్తూ వీక్షకులను మెప్పిస్తోంది. ఇప్పటికే ‘సేక్రెడ్ గేమ్స్ 2’.. ‘మేడ్ ఇన్ హెవెన్’ లాంటి వెబ్ సీరీస్ లలో నటించి సత్తా చాటిన శోభిత తాజాగా ‘ఘోస్ట్ స్టోరీస్’ లో నటించింది.

నెట్ ఫిలిమ్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సీరీస్ లో నాలుగు కథలు ఉన్నాయి. ఇందులో శోభిత నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక గర్భవతి పాత్రలో నటించింది. తన బిడ్డను తనే తినేసే పాత్ర అది. షాకింగ్ గా ఉండే ఇలాంటి పాత్ర పోషించడం ఎలాంటి నటికైనా కష్టమే. జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరీస్ కు పెద్దగా అదరణ దక్కలేదు కానీ శోభిత నటనకు మాత్రం ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. కొందరైతే శోభితను రాధిక ఆప్టే తో పోలుస్తున్నారు. నిజంగా శోభితకు ఇది పెద్ద కాంప్లిమెంటే. రీసెంట్ గా శోభిత ‘ఘోస్ట్ స్టోరీస్’ నుండి తన పాత్రకు సంబంధించిన ఒక స్టిల్ ను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోను చూస్తే సడెన్ గా శోభిత నిజంగా గర్భవతి ఏమో అని అనుమానం రావడం ఖాయం.
Please Read Disclaimer