ట్రైలర్ టాక్: టెనెట్

0

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్ హీరోగా తెరకెక్కుతున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టెనెట్’. నోలన్ ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా అది ఫిలిం మేకర్లకు స్టడీ మెటీరియల్ లాగా నిలుస్తుంది. స్టీవెన్ స్పీల్ బర్గ్ తర్వాత ప్రపపంచవ్యాప్తంగా ఎక్కువమంది అభిమానులు ఉన్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం.. లేదు. మురుగదాస్ ‘గజినీ’ కి ప్రేరణ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలలో ఒకటి.

తాజాగా ఈ ‘టెనెట్’ సినిమా ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ ఆరంభంలో ఒక ఆకాశాన్ని తాకే ఒక బిల్డింగ్ లోకి బైటనుంచి తాడుతో హీరో.. మరో వ్యక్తి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ సీన్స్ లో హీరో ను చంపేస్తారు. సీన్ కట్ చేస్తే “నువ్వు పాస్ అయిన టెస్ట్ ఎవరూ పాస్ అవ్వలేరు. మరణానంతర జీవితానికి స్వాగతం” ల్యాబ్ లో ఒక వ్యక్తి హీరోతో చెప్తారు. ఆ సమయంలో హీరో హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉంటాడు. మరో సీన్ లో హీరో “నేను చేసే పని చేయాలంటే నేనేం పని చేస్తున్నానో నాకు తెలియాలి” అంటూ కండిషన్ చెప్తాడు. అప్పుడు ఒక మహిళ ” నాకు తెలిసినంత వరకూ మనం మూడవ ప్రపంచయుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం” అంటుంది. హీరోకు ‘టెనెట్’ అనే పదం మాత్రం హింట్ గా చెప్తారు.

ఇంతకూ హీరోకు ఎలాంటి మిషన్ అప్పగించారు..అసలు మిషన్ అప్పగించారా లేక ఇరికించారా? ఒకవేళ మిషన్ నిజమే అయితే అదేంటి? అందులో విజయం సాధించాడా? అనేవి సినిమా చూస్తే కానీ బదులు దొరకని ప్రశ్నలు.. అదే మిగతా కథ. నోలన్ అన్ని సినిమాల లాగే ఈ సినిమా కూడా టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ కు ఫ్యూచరిస్టిక్ ఐడియా ఏదో జోడించినట్టుగా అనిపిస్తోంది. నోలన్ ప్రతి సినిమాకు హ్యాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తారు. కానీ ఈ సారి మాత్రం లుడ్విగ్ గొరాన్సన్ సంగీతం అందించారు. ట్రైలర్ లో నేపథ్య సంగీతం సూపర్ గా ఉంది. హాలీవుడ్ సినిమాలు ఇష్టపడేవారికి ట్రైలర్ వెంటనే నచ్చుతుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కూడా నటించారు. ట్రైలర్ లో “నువ్వు ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడడం అలవాటు చేసుకోవాలి” అంటూ హీరోకు ఒక సూచన ఇస్తుంది. ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ చూసేయండి..
Please Read Disclaimer