భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

వీరాభిమాని డైరెక్షన్ లో రజిని 170వ సినిమా..

0

ఇండియన్ సినీ చరిత్రలో స్టైల్ కి పెట్టింది పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నడక మాట చూపు డాన్స్ ఫైట్స్ యాక్షన్ ఏది చేసినా స్టైల్ గానే ఉంటాయి. సూపర్ స్టార్ తలైవర్.. అప్పటి చిరంజీవి కమల్ దగ్గర నుండి నేటి యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నాడు. తలైవర్ సినిమా అంటేనే అభిమానులకు పండగ. స్టైలు స్టైలురా నీది సూపర్ స్టైలురా.. అని కోట్లాది అభిమానులతో అనిపించుకుని నేటికీ హీరోగా థియేటర్లలో దుమ్మురేపుతున్నది రజిని ఒక్కడే. ఇటీవలే ‘దర్బార్’ సినిమా విజయంతో ఊపులో ఉన్న రజిని ప్రస్తుతం శివ దర్శకత్వంలో తన 168వ సినిమాను పూర్తిచేస్తున్నాడు.

ఆ సినిమా షూటింగులో ఉండగానే తన తదుపరి సినిమాలను చకచకా ఓకే చేస్తున్నాడు. ఇక రజిని 169వ సినిమాను ఖైదీ మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తారని అదీగాక కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తాడన్నది విశేషం. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ 170వ సినిమా వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారిన లారెన్స్ రజిని 170వ సినిమాను తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తుంది. ఆల్రెడీ తలైవర్ రజినీకి లారెన్స్ వీరాభిమాని. అప్పుడప్పుడు కలిసి చిన్న స్టోరీ లైన్ వినిపించాడట. ఆ స్టోరీ లైన్ నచ్చడంతో రజిని కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-