ఇళయ దళపతి ఖాతాలో మరో సెన్సషనల్ రికార్డ్!

0

మన దక్షిణాదిన బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే అగ్ర నటుల్లో ఇళయ దళపతి విజయ్ కూడా ఒకరు.మన దగ్గర పవన్ మరియు మహేష్ లకు ఏపాటి క్రేజ్ ఉందో తమిళ్ లో విజయ్ కు కూడా అంతే క్రేజ్ సొంతం.తాజాగా తనతో అప్పటికే బ్లాక్ బస్టర్ చిత్రం “మెర్సెల్” తెలుగులో “అదిరింది” లాంటి అద్భుత చిత్రాన్ని అందించిన అట్లీ దర్శకత్వంలోనే “బిగిల్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా ఇటీవలే విడుదల చెయ్యడంతో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంతరించుకుంది.

అయితే ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కొనుగోలు విషయంలో సౌత్ ఇండియాలో మరో సెన్సషనల్ రికార్డును సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.యునైటెడ్ ఇండియా ఎక్సపోర్ట్స్ వారు ఈ సినిమా హక్కులను 30 కోట్ల భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్టు సమాచారం.ఇది ఇప్పటి వరకు దక్షిణాది సినిమాలలో ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోయిన 5వ చిత్రంగా “బిగిల్” నిలిచిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఈ చిత్రానికి ముందు వరుసలో బాహుబలి2,సాహో,పేట మరియు కబాలి చిత్రాలు ఉన్నాయి.మరి విజయ్ ఈ భారీ మొత్తాన్ని రాబట్టగలడో లేదో చూడాలి.
Please Read Disclaimer