దర్శకుడి పుట్టిన రోజు సంగీత దర్శకుడి హడావుడి

0

సినిమా రంగంలో ఎప్పటికప్పుడు కొందరు ప్రముఖులపై వారి ప్రేమతో కూడిన అభిమానం చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కలిసి సినిమా చేయడం మూలంగానో లేదా వారి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదరడం వల్లో పుట్టినరోజులకు తమ రిలేషన్ షిప్ గురించి తెలియజేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు సంగీత దర్శకుడు తమన్ అదే చేస్తూ దర్శకుడిపై తన ప్రేమను చాటుకుంటున్నాడు.

నవంబర్ 7 అంటే రేపు త్రివిక్రమ్ పుట్టిన రోజు. ఇదే రోజు అనుష్క కూడా పుట్టింది. అయితే సోషల్ మీడియాలో రెండ్రోజుల నుండే అనుష్క బర్త్డే కామన్ డీపీ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో చక్కర్లు కొడుతుంటే. ఇక అదే రోజు త్రివిక్రమ్ బర్త్ డే కూడా ఉందంటూ తన పోస్టులతో బరిలోకి దిగాడు తమన్. నిన్న ఓ పోస్టర్ వదిలి తన ప్రేమను చాటుతూ త్రివిక్రమ్ ను విష్ చేసిన తమన్ ఈ రోజు కూడా అదే పనిలో ఉన్నాడు. నిజానికి త్రివిక్రమ్ మీద తమన్ ఇంత ప్రేమ చూపించడం కరక్టే. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ గా డౌన్ అవుతున్న టైంలో ‘అరవింద సమేత’ కి దేవి అనిరుధ్ లను పక్కన పెట్టి మరీ తమన్ కి చాన్స్ ఇచ్చాడు.

ఇక ఆ సినిమాకు అవకాశం ఇవ్వడంతో మరో సారి తన మ్యూజిక్ టాలెంట్ ను చూపించుకున్నాడు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ కి కూడా దేవి ను కాదని మరీ తమన్ కె ఒటేసాడు త్రివిక్రమ్. దాంతో మళ్ళీ అదిరిపోయే సాంగ్స్ తో ఫాంలోకి వచ్చేసాడు తమన్. సో ఇలా రెండు సార్లు తన టాలెంట్ చూసి అవకాశం ఇచ్చిన మాటల మంత్రికుడికిపై తమన్ ఈ మాత్రం ప్రేమ చూపించడంలో ఎలాంటి తప్పు లేదు.
Please Read Disclaimer