‘సంక్రాంతి’ విన్నర్ అతనే !

0

కొన్ని సినిమాలకు ఒక్కోసారి అనుకోకుండా అన్నీ కలిసొస్తాయి. అయితే అల వైకుంఠపురములో కి కూడా తమన్ మ్యూజిక్ అలాగే అలాగే కలిసొచ్చింది. సినిమా ప్రారంభం కంటే ముందే దేవి ఆ ..? తమన్ ఆ ? అంటూ హాట్ హాట్ గా డిస్కర్షన్స్ నడిచాయి. బన్నీ దేవి కి ఓటేస్తే త్రివిక్రమ్ మాత్రం తమన్ నే తీసుకుందామని పట్టుపట్టారు. ఎట్టకేలకు త్రివిక్రమ్ మాటే నెగ్గింది. ఫైనల్ గా తమన్ యూనిట్ లోకి వచ్చాడు.

ఇక సినిమాకు ఏదో సాదా సీదా ఆల్బం ఇస్తాడనుకునుకుంటే సినిమా మీద తన సాంగ్స్ తో ఓ క్రేజ్ తీసుకొచ్చే రేంజ్ ఆల్బం ఇచ్చాడు. అవును అల నుండి వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి కూడా. అయితే సరిలేరు నుండి వచ్చిన మొదటి పాట నుండి ఇటివలే వచ్చిన డాంగ్ డాంగ్ మినహా అనుకున్నంత రేంజ్ లో లేవు. ఉన్నంతలో డాంగ్ డాంగ్ కొంత వరకూ బెటర్ అనిపించింది.

ఇక దర్బార్ కోసం అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎంత మంచి వాడవురా కి కథకి తగ్గట్టుగా సాంగ్స్ ఇచ్చాడు గోపి సుందర్. అయితే ఈ ఆల్బం గోపి సుందర్ గతం ఇచ్చిన ఆల్బం రేంజ్ లేకపోవడంతో సాంగ్స్ జస్ట్ పరవాలేదు అనిపించాయి. ఈ లెక్కన చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సంక్రాంతి విన్నర్ తమన్ అని స్పష్టం అయిపొయింది. సామజ వరగమనా తో అందనంత దూరానికి రీచ్ అయ్యాడు తమన్.
Please Read Disclaimer