అందరి ప్రార్థనల వల్లే త్వరగా కోలుకున్నా: తమన్నా

0

కరోనా బారిన పడి కోలుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత ముంబయిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె కరోనా లక్షణాలతో బాధపడ్డారు. దీంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే నగరంలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు.

వారం రోజులకే కోలుకున్నప్పటికీ కొద్దిరోజులు నగరంలోనే హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ముంబయికి చేరుకున్నారు. ‘ఇంత తర్వగా కోలుకుంటానని అనుకోలేదు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యుల ప్రార్థనలతోనే త్వరగా బమటపడ్డారు. ఇప్పుడు నేనే ఇమ్యునిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on