”థ్యాంక్యూ” చెప్పేసిన నాగ చైతన్య…!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తండ్రి ‘కింగ్’ నాగార్జున బాటలో నడుస్తూ సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఏమాయ చేసావే’ ‘100% లవ్’ ‘తడాఖా’ ‘మనం’ ‘ఒక లైలా కోసం’ ‘ప్రేమమ్’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తున్న నాగ చైతన్య.. విక్రమ్ కె కుమార్ తో ఓ మూవీ చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నేడు ‘కింగ్’ నాగార్జున 61వ పుట్టినరోజును పురష్కరించుకొని వీరి కాంబోలో “థాంక్యూ” అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

కాగా నాగచైతన్య కెరీర్లో 20వ చిత్రంగా రానున్న “థాంక్యూ” ని శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి లు నిర్మించనున్నారు. నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్తూ మేకర్స్ ‘థాంక్యూ’ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘మా 20 ఏళ్ళ సినీ ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు థాంక్యూ’ అని దిల్ రాజు.. నాకు ‘మనం’ సినిమా ఇచ్చిందనుకు థాంక్యూ’ అని విక్రమ్ కె.కుమార్.. ‘నా కింగ్ అయినందుకు థాంక్యూ’ అని నాగ చైతన్య అక్కినేని నాగార్జునకు శుభాకాంక్షలు చెప్పారు.

ఇప్పటి వరకు చూడని స్టైల్లో సరికొత్తగా నాగచైతన్యను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుందని.. చైతు – విక్రమ్ హిట్ కాంబినేషన్ లో సినిమాను చేయనుండటం ఆనందంగా ఉందని.. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. గతంలో అక్కినేని ఫ్యామిలీకి ”మనం” వంటి చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందించిన విక్రమ్ కె.కుమార్ మరోసారి అక్కినేని హీరోకి ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి. ఈ మూవీ లో నాగచైతన్య మూడు విభిన్న తరహా గెటప్స్ లో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.