ఒక్క చెంపదెబ్బకే విడాకులా తాప్సి?

0

సౌత్ నుండి బాలీవుడ్ కు వెళ్లిన తాప్సికి అదృష్టం కొద్ది మంచి సినిమాల్లో నటించే అవకాశం దక్కుతుంది. ఈమె చేస్తున్న సినిమాలు ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కావడంతో ఈమెకు నటిగా మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పటి వరకు ఈమె నటించిన సినిమాలు కమర్షియల్ గా కొన్ని ఆడాయి.. కొన్ని ఆడలేదు. కాని ఈమెకు ప్రతి సినిమాతో నటిగా మాత్రం గుర్తింపు పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం ఈమె థప్పడ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఫిబ్రవరి 28న విడుదల కాబోతున్న ‘థప్పడ్’ చిత్రం కూడా తాప్సి గత చిత్రాల మాదిరిగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రంగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. తాజాగా వచ్చిన ట్రైలర్ తో సినిమా కథ ఏంటో మొత్తం క్లారిటీ ఇచ్చారు. ఒక భార్యను భర్త నలుగురిలో చెంపదెబ్బ కొడితే ఆమె అహం దెబ్బ తిని అతడితో విడాకులు తీసుకునేందుకు సిద్దం అవుతుంది. ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఏంటీ అనేది ఈ చిత్ర కథాంశంగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.

ఈ ట్రైలర్ చూసిన తర్వాత మగవారు తాప్సిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చెంప దెబ్బకు విడాకులు తీసుకోవాలంటూ నీవు సినిమాలో చెప్తే మా ఆడవారు కూడా అదే విధంగా ఎప్పుడో పొరపాటున చెంపదెబ్బ కొడితే విడాకుల వరకు వెళ్లరా అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంతో తాప్సి నటిగా మరో మెట్టు ఎక్కడం ఖాయం అంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాప్సి ఈ చిత్రంలో ఒక గృహిణిగా కనిపించేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అంటూ మరికొందరు అంటున్నారు. మొత్తానికి ‘థప్పడ్’ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశం అయ్యింది.
Please Read Disclaimer