ఆ విషయం లీక్ చేసిన తరుణ్ భాస్కర్!

0

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం అయ్యాడు. విజయ్.. తరుణ్ ఇద్దరూ మొదటి నుంచి క్లోజ్ అనే సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్ళిచూపులు’ విజయ్ కి సోలో హీరోగా ఫస్ట్ హిట్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ ను విజయ్ హీరోగా పరిచయం చేస్తూ సినిమాను నిర్మించాడు. ప్రతి సినిమాకు విజయ్ ప్రమోషన్స్ విభిన్నంగా ఉంటాయి.. ఈ సినిమా విషయంలో కూడా అదే స్ట్రేటజీ ఫాలో అవుతున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తరుణ్ భాస్కర్ ఒక వాట్సాప్ చాట్ ను లీక్ చేశాడు. ఈ చాట్ లో విజయ్ దేవరకొండ – తరుణ్ భాస్కర్ మధ్య జరిగిన సంభాషణ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

విజయ్: భాస్కర్ గారు.. సారీ ఈ నైట్ కు నేను రాలేను. మీరు ఎంజాయ్ చెయ్యండి. మనం రేపు కలుద్దాం

తరుణ్: అరే.. నువ్వు రా విజయ్

విజయ్: నేను కూర్చుని నీకోసం ప్రత్యేకంగా ఒక బర్త్ డే టీజర్ కట్ చేశానురా.. చూసి ఎంజాయ్ చెయ్.

తరుణ్: నేను చూశాను. నాకెందుకో ఇబ్బందిగా ఉంది

విజయ్: ఇబ్బంది ఏంటి.. అది నీ మంచితనం రా

తరుణ్: నేను అంత మంచోడిని కాదు. నాకు ఆ వీడియో గిఫ్ట్ చాలదు. నాకు సరైన గిఫ్ట్ కావాలి.

విజయ్: సరే.. అడుగు

తరుణ్: నా నెక్స్ట్ ఫిలిం లో డ్యాన్స్ చేస్తావా?

విజయ్: చెయ్యను. గుడ్ నైట్

తరుణ్: సరే సరే. రేపు కాలేజ్ స్టూడెంట్స్ కి ఒక స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చెయ్

తరుణ్: ప్రొడ్యూసర్ సాబ్..ఏమంటావ్

తరుణ్: నిద్రపోయావా

విజయ్: సారీ డిన్నర్ చేస్తున్నా

విజయ్: ఓకే. అరేంజ్ చేస్తా

ఇలా సాగింది.. ఇద్దరి సంభాషణ. మొత్తానికి కాలేజ్ స్టూడెంట్స్ కి స్పెషల్ స్క్రీనింగ్ కోసం నిర్మాత దేవరకొండ గారిని ఒప్పించాడు తరుణ్. ఇప్పటివరకూ ఎన్నో లీక్స్ చూసి ఉంటాం మనం. దాదాపు మీడియాలో లీక్ అయిన చాట్ లన్నీ డేంజర్ వే. ఇదొక్కటే ఫన్నీ చాట్. సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home