దర్బార్ కి ఆ నిర్మాత సపోర్ట్ లేదా?

0

వెంకటేష్-నాగచైతన్య కథానాయకులుగా నటించిన వెంకీ మామ క్లీన్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. నిర్మాత సురేష్ బాబు సొంత రిలీజ్ కావడంతో థియేటర్ల పరంగా ప్లస్ అయ్యింది. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది అంటే ఆయన చలువే. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ కాకపోవడం అదనపు అస్సెట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా స్థిరమైన వసూళ్లనే సాధిస్తోందట. ఆరంభమే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ బాగా కలిసొచ్చింది.

నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడి గా నటించిన దర్బార్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకు థియేటర్ల పరంగా సురేష్ బాబు సహకారం పెద్దగా లభించలేదని టాక్ వినిపిస్తోంది. రజనీ సినిమా రిలీజ్ అయినా వెంకీమామని ఇంకా థియేటర్లో ఆడించే ప్రయత్నం చేస్తున్నారుట. చాలా సెంటర్లలో వెంకీ మామ ఆడుతోందన్న విషయం రజనీ అభిమానులను కలవరపెడుతోంది. తమ ఫేవరెట్ కి తెలుగు స్టేట్స్ లో అనుకున్నన్ని థియేటర్లు దక్కలేదన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.

సురేష్ బాబు సొంత థియేటర్లలలో అయితే ఇంకొద్ది రోజుల పాటు వెంకీ మామనే ఆడించుకునే సన్నివేశం కనిపిస్తోందని అంటున్నారు. చాలాచోట్ల సురేష్ బాబు వోన్ రిలీజ్ కావడం వల్లనే దర్బార్ కి థియేటర్ల పరంగా పంచ్ పడిందని చెబుతున్నారు. మరి ఈ కథనాలపై సురేష్ బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఆ నలుగురిలో ఒకడిగా థియేటర్ల ను బ్లాక్ చేస్తారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన. ఇప్పుడు నేరుగా సూపర్ స్టార్ల సినిమాకే ఇలాంటి సన్నివేశం ఎదురైందంటే.. చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి ఏమిటో అంటూ మరోసారి ఫిలింసర్కిల్స్ లో చర్చ సాగుతోంది.
Please Read Disclaimer