సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

బాబోయ్ ఏంటి అమ్మడు ఈ ఫోజ్

0

హీరోయిన్స్ వెండి తెరపై చాలా అందంగా.. సుకుమారంగా కనిపిస్తారు. వారు అందం పట్ల జాగ్రత్తగా మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటారు చాలా మంది. కాని వారి ఫిజిక్ ను ఎప్పుడు ఒకేలా ఉంచుకునేందుకు పడే కష్టం మామూలుగా ఉండదు. స్టార్ హీరోయిన్స్ దాదాపు అంతా కూడా రోజులో కనీసం రెండు నుండి నాలుగు గంటల పాటు జిమ్ లో వర్కౌట్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ తమ ఫిజిక్ ను అలా మెయింటెన్ చేసేందుకు ఇంకెంత కష్ట పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పూజా హెగ్డే జిమ్ లో ఏ రేంజ్ లో కష్టపడుతుందో ఈ ఫొటోను చూస్తుంటేనే అర్థం అవుతుంది. ముద్దుగుమ్మ పూజా హెగ్డే వర్కౌట్స్ అంటూ ఏకంగా జిమ్నాస్టిక్స్ చేస్తుంది. రెండు కాళ్లు అలా పూర్తిగా స్ట్రెస్ చేయడం అనేది అందరికి సాధ్యం అయ్యే విషయం కాదు. అది కూడా ఒక కాలు కింద ఉంచి మరో కాలు పైన పెట్టి స్ట్రెస్ చేయడం చాలా మంది హీరోలకు కూడా సాధ్యం అవ్వక పోవచ్చు. పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడి ఈ ఫోజ్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. పూజా అందం అంతా ఆ కాళ్లలోనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే టైం నడుస్తుంది. అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్ తో పూజా క్రేజ్ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో ప్రభాస్ తో కలిసి చేస్తున్న జాన్ చిత్రం కూడా సక్సెస్ అయితే ఈ అమ్మడిని ఆపడం కష్టమే. టాలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్స్ జాబితాలో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.




Please Read Disclaimer