టైమ్ చూసి కొడుతోంది అబ్బ అనేలా

0

దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి.. ఈ ఫార్ములాని అనుసరించడంలో రష్మిక తర్వాతనే. కన్నడ సినిమాతో విజయం అందుకుని అటుపై టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తెలుగులో ఛలో చిత్రంతో మరో విజయం ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత గీత గోవిందం ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. రష్మిక నటించిన తొలి జంబో మూవీ `సరిలేరు నీకెవ్వరు` నేడు (శనివారం) థియేటర్లలోకి రిలీజైన సంగతి తెలిసిందే.

సరిగ్గా టైమ్ చూసి రష్మిక గేర్ మార్చేసింది. ఇప్పుడు వరుసగా నేషనల్ లెవల్ కాన్ సన్ ట్రేషన్ ఉండే మ్యాగజైన్ కవర్ పేజీలపై హల్ చల్ చేయబోతోంది. తొలిగా ప్రఖ్యాత జే.ఎఫ్.డబ్ల్యూ మ్యాగజైన్ కవర్ పేజీ పై దర్శనమిచ్చింది. ఇదే ఈ తరహా అతి పెద్ద తొలి ఎటెంప్ట్. అందువల్ల రష్మిక ఎంతో ఎగ్జయిట్ అవుతోంది. తన ఉత్సాహానికి తగినట్టే కవర్ షూట్ అదిరిపోయిందనే చెప్పాలి.

ఇక జె.ఎఫ్.డబ్ల్యూ కవర్ పేజీ పై రష్మిక పింక్ లుక్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ టాప్ మైండ్ బ్లో అనే చెప్పాలి. ఈ లుక్ స్టైలిష్ .. అన్ స్టాపబుల్! అంటూ రష్మిక ఎంతో ఉద్వేగానికి లోనవుతోంది. రష్మిక కెరీర్ ని పరిశీలిస్తే.. మహేష్ తర్వాత వెంటనే బన్ని సరసన అవకాశం దక్కించుకుంది. తదుపరి బన్ని కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఏఏ21 సెట్స్ కి అటెండ్ కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
Please Read Disclaimer