సురేష్ బాబు దిల్ రాజు ల మధ్య ఒప్పందం ?

0

ప్రస్తుతం డిసెంబర్ లో రిలీజ్ అవ్వనున్న అన్ని సినిమాలు డేట్ లాక్ చేసేసుకొని ప్రమోషన్స్ తో హంగామా చేస్తున్నాయి. అయితే ఓ రెండు సినిమాలు మాత్రం ఇంకా డిస్కర్షన్ స్టేజిలోనే ఉన్నాయి. అందులో ఒకటి ‘వెంకీ మామ’ మరొకటి ‘ఇద్దరి లోకం ఒకటే’. అవును వెంకీ మామ కి సంబంధించి ఇంత వరకూ రిలీజ్ డేట్ ప్రకటించలేదు సురేష్ బాబు.

మొన్నటి వరకూ 13 న సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని చూసారు. కానీ సురేష్ బాబు మళ్ళీ మనసు మార్చుకొని డిసెంబర్ 25 న రిలీజ్ అనుకుంటున్నాడు. అయితే రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ అదే రోజు రిలీజ్ అంటూ మొన్నీ మధ్య ప్రకటించారు. అయితే ఇప్పుడా డేట్ విషయంలో సురేష్ బాబు రాజుల మధ్య డిస్కర్షన్ పెట్టారట.

ఇక ఫైనల్ గా ‘వెంకీ మామ’ కోసం డిసెంబర్ 25 నుండి డిసెంబర్ 13 కి ఇద్దరి లోకం ఒకటే ను ప్రీ పోన్ చేసుకున్నారట దిల్ రాజు. అందుకే ముందుగానే సెన్సార్ కూడా పూర్తి చేసి రెడీ గా ఉంచారట. ఈ మేరకు సాయంత్రం ఓ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా రిలీజ్ డేట్ చెప్పనున్నాడు రాజు. మరి ఇదే నిజమైతే రాజ్ తరుణ్ సినిమా ప్రమోషన్స్ కి కేవలం పది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ పది రోజుల్లో సినిమాపై బజ్ వస్తుందా ఓపెనింగ్స్ రాబడుతుండా చూడాలి.
Please Read Disclaimer