బాక్స్ ఆఫీసును కొల్లగొడుతున్న బట్టతల బాలా!

0

విభిన్నమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ బాలీవుడ్ లో నిలకడగా విజయాలు సాధిస్తున్న హీరో ఆయుష్మాన్ ఖురానా. ఆయన కొత్త సినిమా ‘బాలా’ కూడా విభిన్నమైన కథతో తెరకెక్కిందే. బట్టతలతో ఇబ్బందులు పడే వ్యక్తి కథే ‘బాలా’. ఈ శుక్రవారమే ‘బాలా’ రిలీజ్ అయింది.. మంచి టాక్ తెచ్చుకుంది. అటు విమర్శకులు.. ఇటు సాధారణ ప్రేక్షకులు సినిమాను మెచ్చుకుంటున్నారు. దీంతో ‘బాలా’ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ మోత మోగిస్తోంది.

‘బాలా’ మొదటిరోజే రూ. 10.15 కోట్ల రూపాయలు సాధించి ఆయుష్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక రెండవ రోజు శనివారం రూ. 15.73 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ రూ. 20 కోట్లు టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లెక్కన బాలా సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తున్నట్టే. ఆయుష్మాన్ గత చిత్రాల కంటే ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుండడంతో ‘బాలా’ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. మరింత జోరుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమాలో భూమి పెడ్నేకర్.. యామి గౌతమ్ హీరోయిన్లు గా నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దినేష్ విజాన్ నిర్మించారు. హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి త్వరలో తెలుగులో రీమేక్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అయితే బాల్డ్ హెడ్ తో కనిపించే ధైర్యం చేయగల టాలీవుడ్ హీరో ఎవరో వేచి చూడాలి.
Please Read Disclaimer