ప్రభాస్ పంపిన క్యారేజీ విప్పితే కోమాలోకే

0

డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి తెలిసిన వారెవరైనా కనీసం అర్థగంట అయినా పొగిడేయకుండా ఉండలేరు. అతడు వడ్డించే వంటకాల చిట్టా చెప్పేందుకే పావుగంట పడుతుంది. అంత పెద్ద నోరూరించే మెనూతో నోట మాట రానివ్వకుండా చేయడం అతడి ప్రత్యేకత. ప్రభాస్ రాజానా మజాకానా? రాజా వారి విందు పసందు అంటూ ఆరగించాల్సిందే.

ఇంతకుముందు సాహో సెట్స్ లో శ్రద్ధా కపూర్ కి అలాంటి సర్ ప్రైజ్ ట్విస్ట్ ఎదురైంది. ప్రభాస్ తెచ్చిన క్యారేజీలో వంటకాల జాబితా చూసి కళ్లు తేలేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. తన ప్రతి సినిమాలో కథానాయికలకు ఇంచుమించు ఇలాంటి సర్ ప్రైజ్ ట్రీటుంటుంది. చందమామ కాజల్ సైతం ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసింది. ఇక స్వీటీ అనుష్కకు అయితే ఇలాంటి క్యారేజీలతో ఎన్నో సర్ ప్రైజ్ లు.

అదంతా సరే కానీ.. ఇప్పుడు జాన్ కోస్టార్ పూజా హెగ్డే పరిస్థితి ఏమిటి? అంటే ఏకంగా అతడు పంపించిన క్యారేజీ విప్పితే డైరెక్టుగా కోమాలోకి వెళ్లిపోయినంత పనైందట. ఆ విషయాన్ని తనే చెప్పుకొచ్చింది. ఏదైనా ద్వీపానికి వెళ్లిపోతే అక్కడ నాతో ఒకరు ఉంటే సరిపోతుంది. అది ప్రభాస్ అయితే ఎంత బావుంటుందో. ఇప్పుడు నేను కోమాలో ఉన్నా. థాంక్యూ.. ఆ క్యారేజీ పంపించినందుకు!! అంటూ ప్రభాస్ పై ప్రేమతో కూడుకున్న ప్రశంసల్ని కురిపించింది.

పాపం పూజా… ఓ వైపు బన్నితో మరోవైపు అఖిల్ తో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇంకోవైపు ప్రభాస్ జాన్ సెట్స్ కి వెళ్లనుంది. అయితే ఇప్పటికే ఇద్దరితో లంచ్ లు డిన్నర్ లు చేస్తోంది కాబట్టి.. ప్రభాస్ పంపిన క్యారేజీ స్పెషాలిటీ ఏంటో అర్థమైనట్టుంది. ఆ క్యారేజ్ ఎంత స్పెషలో చెప్పకనే చెప్పేసింది. ప్రభాస్- పూజా జంటగా నటిస్తున్న జాన్ 2020 సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer