‘సూర్య – వెట్రిమారన్’ల కాంబినేషన్ ఇప్పట్లో లేనట్లే..నా?

0

తమిళ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ వెట్రిమారన్ అంటే సూపర్ హిట్లకు మరో పేరుగా మారిపోయాడు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇటీవలే ధనుష్ హీరోగా అసురన్ సినిమా తెరకెక్కించి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక ధనుష్ కెరీర్లో మర్చిపోలేని సినిమాగా అసురన్ రికార్డులు బ్రేక్ చేసింది. నిజానికి ధనుష్ కెరీర్లో వెట్రిమారన్ రూపొందించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లే. ప్రస్తుతం అసురన్ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అవుతోంది. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో సూర్యతో వెట్రిమారన్ తన తదుపరి సినిమా చేయనున్నాడని వార్తలు వినిపించాయి. దీనిపై బడా నిర్మాత కలైపులి ఎస్ థాను కూడా క్లారిటీ ఇచ్చాడు.గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం హీరో సూర్య ప్లాపుల్లో కూరుకుపోయాడు. ఒకప్పుడు తెలుగు సినిమాలకు ధీటుగా సూర్య సినిమాలు తెలుగులో విజయం సాధించేవి. తెలుగు స్టార్ హీరోలతో పాటు సమానంగా కలెక్షన్స్ రాబట్టేవి. కానీ ఇదంతా సింగం 3కి వరకే. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ తారుమారు అయ్యాయి. బాక్సాఫీక్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు వరుస ప్లాపులతో సూర్య దాదాపుగా తెలుగులో మార్కెట్ సగం కోల్పోయాడని టాక్. సూర్య హీరోగా నటించిన గ్యాంగ్ ఎన్జికె బందోబస్త్ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా నిరుత్సాహపరిచాయి. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా అనే సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. కానీ ప్రస్తుతం సూర్య-వెట్రిమారన్ మూవీ పై ఇండస్ట్రీలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అట్టడుగు వర్గాల కథలను హృదయానికి హత్తుకునే విధంగా రూపొందించే వెట్రిమారన్ సూర్యను ఎలా చూపించబోతున్నారో అని ఇప్పుడే సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కానీ తాజా సమాచారం ప్రకారం.. వెట్రిమారన్ ఇంకా సిద్ధం కాలేదట. ఆయన ప్రస్తుతం సూర్య సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీ ఉన్నాడట. అయితే ఆలస్యం అయ్యేలా ఉందని సూర్య మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఇదే గనక నిజమైతే సూర్య-వెట్రిమారన్ కాంబినేషన్ మూవీ మళ్లీ ఎప్పుడు కుదురుతుందో..!