రాజు గారు చెప్పారు.. ప్రేమ్ గారు పాటించలేదు!

0

రీమేక్ లు చెయ్యడం అందరివల్లా కాదు. శంకర్ లాంటి దర్శకుడు ‘3 ఇడియట్స్’ లాంటి అద్భుత కథను రీమేక్ చేయడంలో తడబడ్డారు. ఫ్లాప్ మూటకట్టుకున్నారు. ఇక రీమేక్ లు చెయ్యడంలో కొందరు స్పెషలిస్టులు ఉంటారు. ఒరిజినల్ సినిమా సోల్ ను మాత్రమే తీసుకుని దాన్ని ఫ్రెష్ గా మలచడం లేదంటే పూర్తిగా కొత్త టచ్ ఇస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగే వారు.. హరీష్ శంకర్ అలాంటి జాబితాలోనే ఉంటారు. ఎన్నో లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ‘ప్రేమమ్’ రీమేక్ ను అద్భుతంగా హ్యాండిల్ చేశారని చందూ మొండేటి కూడా ప్రశంసలు దక్కుతూ ఉంటాయి. ఇక ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ను హిందీలో అంతకంటే పెద్ద హిట్ గా మలిచారు సందీప్ వంగా.

అయితే ’96’ దర్శకుడు ప్రేమ్ కుమార్ మాత్రం తెలుగు రీమేక్ ‘జాను’ తో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ సినిమా నిజానికి తమిళ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఉండడంతో అక్కడ సూపర్ హిట్ అయింది. క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది. అందుకే దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రిమేక్ చేయాలని సంకల్పించారు. ఒరిజినల్ దర్శకుడికే బాధ్యతలు అప్పగించారు. అయితే రాజుగారు తెలుగు వెర్షన్ కు కొన్ని మార్పులు సూచించారట. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను జోడించాలని.. స్లో గా ఉన్న నరేషన్ ను మారుద్దామని చెప్పారట. అయితే ఈ సూచనలను ప్రేమ్ కుమార్ పట్టించుకోకుండా తన పంథాలోనే సినిమాను తెరకెక్కించడం తో ఇప్పుడు సినిమాకు డల్ రెస్పాన్స్ వస్తోందని.. బీ.. సీ సెంటర్ లో ప్రేక్షకులు దూరమయ్యారనే టాక్ వినిపిస్తోంది.

ప్రేమ్ కుమార్ సబ్జెక్ట్ మంచిదే కానీ ప్రేక్షకుల అభిరుచులు.. నేటివిటీ లాంటి కొన్ని అంశాలను విస్మరించడంతోనే సూపర్ హిట్ గా నిలవాల్సిన సినిమా ఇప్పుడు ఫ్లాప్ దిశగా పయనించాల్సి వస్తోందని అంటున్నారు.
Please Read Disclaimer