రాజ్ తరుణ్ ప్లేస్ లో నిఖిల్ ఏం జరిగింది ?

0

నిన్న నిఖిల్ కొత్త సినిమా అనౌన్స్ చేసారు మేకర్స్. గీతా ఆర్ట్స్ 2 సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో నిఖిల్ నటించనున్నట్లు తెలిపారు. అయితే ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత రాజ్ తరుణ్ తో సినిమా అనౌన్స్ చేసాడు సూర్య ప్రతాప్. ఆ అనౌన్స్ మెంట్ తో ‘కుమారి 21 ఎఫ్’ కాంబోలో మరో సినిమా అంటూ ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యారు.

కట్ చేస్తే ఇప్పుడు దర్శకుడు యూ టర్న్ తీసుకొని నిఖిల్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేసాడు ప్రతాప్. మధ్యలో సుకుమార్ కి స్క్రిప్టింగ్ లో హెల్ప్ చేసి ఆయన దగ్గరే ఉండిపోయాడు. అందుకే నిఖిల్ తో సినిమా చేసి గీతా ఆర్ట్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్ట్ ఇచ్చాడు సుక్కు.

అయితే నిఖిల్ తో ప్రతాప్ చేస్తున్న సినిమా రాజ్ తరుణ్ చెప్పిన కథతోనే తెరకెక్కుతుందా అనే డాట్ కూడా రైజ్ అవుతుంది. కాకపోతే రాజ్ తరుణ్ సినిమాకు సుకుమార్ పేరు ఎక్కడా వినబడలేదు. ఇప్పుడు నిఖిల్ సినిమాకు ఆయనే కథ స్క్రీన్ ప్లే ఇస్తున్నాడు. అంటే ఇది ఆ కథ కాకపోవచ్చు.
Please Read Disclaimer