ఆ దర్శకుడి కూతురు ఈ హీరో కొడుక్కి పెళ్లి

0

దర్శకుడు ప్రియదర్శన్ నటి లిజీల కూతురు కళ్యాణి ప్రియదర్శన్ పలు భాషల్లో హీరోయిన్ గా నటిస్తూ సక్సెస్ ఫుల్ గా అవకాశాలు అందుకుంటుంది. ‘హలో; సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయం అయిన కళ్యాణి చిత్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు హలో సినిమాలో ఈమె చేసిన పాత్ర ఆమె నిజ జీవితంలో కూడా జరగబోతున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు చిన్నప్పటి ఫ్రెండ్స్. తర్వాత విడిపోయి పెద్దయ్యాక మళ్ళి కలుసుకుంటారు. ఈ కథలో ఉన్నట్టే కాకపోయినా కొంచెం అటూ ఇటూ లో ఆమె కథ కూడా ఇలానే ఉండబోతుంది.

దర్శకుడు ప్రియదర్శన్ హీరో మోహన్ లాల్ కుటుంబాల మధ్య ఎప్పటినుండో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 43 సినిమాలు వచ్చాయి. దానితో ప్రియదర్శన్ కూతురు కళ్యాణి మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ చిన్నప్పటి నుండి కలిసి మెలిసి పెరిగారు. అది ఇప్పుడు ప్రేమగా మారినట్టు కూడా తెలుస్తుంది. కళ్యాణి ఇంతకుముందు ఒక సందర్భంలో తాను ఒకరిని ప్రేమిస్తున్నానని అతనినే పెళ్లి చేసుకుంటాని చెప్పింది. అంతేకాదు తమ ప్రేమ విషయం పెద్దలకి కూడా తెలుసని వాళ్ళు కూడా ఓకే అన్నారని చెప్పింది కానీ అతని పేరు చెప్పలేదు. కానీ ఇప్పుడు బయటకి వచ్చిన టాక్ ప్రకారం ఆమె ప్రేమించేది ప్రణవ్ నే అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు.
Please Read Disclaimer