దీపావళి పోటీ ఈ ఇద్దరిదే!

0

ఈమధ్య బాక్స్ ఆఫీస్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ బాక్స్ ఆఫీస్ పోటీలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ‘బిగిల్'(తెలుగులో విజిల్) అక్టోబర్ 25 న రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట ఈ సినిమాకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. విజయ్ వరస హిట్ల మీద జోరుగా ఉండడమే కాకుండా విజయ్-అట్లీ కాంబినేషన్ గతంలో తెరకెక్కిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే దీనికి కారణం. ఇక ‘బిగిల్’ ప్రోమోస్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పోటీగా కార్తి ‘ఖైది’ తో రంగంలోకి దిగుతున్నాడు.

కార్తి కూడా ‘ఖైది’ట్రైలర్ తో ఒక్కసారిగా అందరి చూపును తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే కార్తి ఈమధ్య నటించిన సినిమాలేవి విజయం సాధించలేదు. అయినా ధైర్యంగా విజయ్ సినిమాతో పోటీకి సై అనడం అందరినీ అశ్చర్యపరుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల డబ్బింగ్ వెర్షన్లు అదే రోజు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. తమిళంలో విజయ్ పెద్ద స్టార్ కానీ తెలుగు వచ్చేసరికి సీన్ రివర్స్.. ఇక్కడ కార్తి సినిమాలకు ఆదరణ ఎక్కువ.

తెలుగులో దీపావళి పండుగ నాడు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. దీంతో విజయ్.. కార్తిలకు బాక్స్ ఆఫీసు వద్ద తమ సత్తా చాటేందుకు ఇదో గోల్డెన్ ఛాన్స్. మరి ఈ అవకాశాన్ని ఎవరు ఫుల్ గా వాడుకుంటారో వేచి చూడాలి.
Please Read Disclaimer