హీరోయిన్లు లేక అల్లాడుతున్న టాలీవుడ్!

0

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉందనేది వాస్తవం. హీరోయిన్ల సంఖ్య పెద్దదే కానీ వారిలో చాలామందికి స్టార్ హీరోల సినిమాలకు తీసుకునే స్థాయి లేదు. ఇక చాలామంది స్టార్ హీరోయిన్లు సీనియర్లు అయిపోయారు. శ్రీయ శరణ్.. కాజల్ అగర్వాల్.. తమన్నా భాటియా..ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కెరీర్ చివరి దశలో ఉన్నారు. అనుష్క.. సమంతా కూడా దాదాపు కెరీర్ ముగింపు దశలోనే ఉన్నారు. ఇక స్టార్ హీరోయిన్ల లీగ్ లో పూజా హెగ్డే తప్ప మరో హీరోయిన్ కనిపించడం లేదు. రష్మిక లాంటి క్రేజీ హీరోయిన్ కూడా మహేష్ బాబు పక్కన సూట్ కాలేదని టాక్ వినిపించింది.

స్టార్ హీరోయిన్ కావాలంటే చాలా లక్షణాలు ఉండాలి. గ్లామర్.. కొద్దో గొప్పో నటన.. కెరీర్ లో హిట్లు.. వీటన్నిటికీ తోడుగా ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా ఉండాలి. సింపుల్ గా చెప్తే హీరోయిన్ పేరుతో బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని అయినా టికెట్లు తెగాలి. అత్తెసరు హీరోయిన్లకు అంత సీన్ ఉండదు. అందుకే వారిని స్టార్ హీరోల సినిమాలకు అసలు పట్టించుకోరు. క్రేజీ హీరోయిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా సినిమాలకు హీరోయిన్ ఎంపిక సమస్యగా మారుతోంది. సరైన హీరోయిన్ దొరక్కపోవడంతో చాలా సినిమాలు షూటింగ్ వరకూ పోవడం లేదు. ఒక ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ కు వెళ్లక మునుపు డిలే అయ్యేది సరిగ్గా ఇక్కడే. బాలీవుడ్ హీరోయిన్లకు అవకాశం ఇస్తే వారు నాలుగు సినిమాలు చేసి పేరు రాగానే బాలీవుడ్ ఆఫర్ల కోసం ముంబైకి చెక్కేస్తున్నారు. శ్రద్ధ కపూర్ లాంటి వాళ్లు తెలుగు ఆడియన్స్ లో ఎక్కువమందికి కనెక్ట్ కావడం లేదు.

రకుల్ లాంటి వారు అందుబాటులో ఉన్నప్పటికీ ఫ్లాపులలో ఉండడంతో సెంటిమెంట్ పరంగా ఫిలింమేకర్లు జంకుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో పూరి లాంటి డాషింగ్ డైరెక్టర్లు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తేనే ఈ టాలీవుడ్ మాహిష్మతి ఊపిరి పీల్చుకుంటుంది. లేకపోతే ఎప్పుడు పాత హీరోయిన్లేనా అంటూ సరసులైన తెలుగు సినీ ప్రియులు బాధ పడుతున్నారు. ఇప్పటికే వారికి మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి టాలీవుడ్ ను ఏలబోయే ముద్దుగుమ్మలు.. అపరంజి బొమ్మలు ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-