‘ఓ బేబీ’ ఫేం తేజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ ఫస్ట్ లుక్…!

0

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు. గతేడాది ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన తేజా ఇప్పుడు శివానీ రాజశేఖర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మహాతేజా క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల మరియు ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ నుండి తాజాగా హీరో తేజ సజ్జా లుక్ రిలీజైంది. నేడు తేజ పుట్టినరోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తూ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఫాంటసీ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిఖార్జున్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా రథన్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ చిత్రంలో తులసి – శివాజీ రాజా – సత్య – మిర్చి కిరణ్ – దేవీ ప్రసాద్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ”మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్ ఒరిజనల్స్ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్-1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. మూవీ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు.