గోవా ఫెస్టివల్ కి ఇద్దరు సూపర్ స్టార్లు

0

50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రభుత్వం జరిపే వేడుకలు కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశీయులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫెస్టివల్ ఓపెనింగ్ డే కార్యక్రమానికి షెహన్ షా అమితాబచ్చన్ సూపర స్టార్ రజనీకాంత్ లు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు.

అంటే తలైవా.. బిగ్బి లను ఒకే వేదికపై చూసుకునే అదృష్టం అభిమానులను కలిగిందన్న మాట. ఈ సందర్భంగా వేడుకల్లో బిగ్ బి అమితాబ్ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అలాగే ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రజనీ స్పెషల్ ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ పురస్కారం అందుకోనున్నారు. ఇటీవలే బిగ్ బీని అత్యున్నత పౌర పురస్కారం దాదా సాహెబ్ ఫాల్క్ అందుకున్న సంగతి తెలిసిందే.

గోవాలో జరిగే అంతర్జాతీయ సినీఉత్సవాలకు ప్రతియేటా టాలీవుడ్ మీడియా నుంచి పలువురు ఎటెండవుతున్నారు. ఇక్కడి నుంచి ఔత్సాహిక దర్శకనిర్మాతలు.. రచయితలు.. ఫిలింమేకర్స్ పెద్ద ఎత్తున హాజరై నాలెజ్ పెంచుకుంటుంటారు. ఇలాంటి అంతర్జాతీయ సినీఉత్సవాల నుంచి బోలెడంత సమాచారం.. కమ్యూనికేషన్ అందుతోంది.
Please Read Disclaimer