మెగా విలన్ మనుమడు వచ్చేస్తున్నాడు

0

ఇండియన్ సినిమా విలన్స్ జాబితాలో ఎవగ్రీన్ విలన్ గా అమ్రిష్ పురి ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 450 సినిమాలకు పైగా చేసిన అమ్రిష్ పురి బాలీవుడ్ టాప్ విలన్ గా పేరు దక్కించుకున్నారు. తెలుగులో కూడా ఈయన పలు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి మరియు కొండవీటి దొంగ చిత్రాల్లో ఈయన విలనిజం పీక్స్ లో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులతో మెగా విలన్ అనిపించుకున్న అమ్రిష్ పురి 2005లో మృతి చెందారు. ఇప్పుడు ఆయన మనవడు వర్ధన్ పురి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

‘యే సాలి ఆషికి’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు వర్ధన్ పురి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న యే సాలి ఆషికి చిత్రాన్ని వచ్చే నెల 22న విడుదల చేయబోతున్నారు. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని.. సినిమా మొత్తం కూడా ఫుల్ ట్విస్ట్ లు మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటుందని మేకర్స్ అంటున్నారు. అమ్రిష్ పురికి ఇప్పటికి కూడా ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది కనుక ఆయన మనవడు వర్ధన్ ను కూడా ప్రేక్షకులు ఆధరించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.

ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరి వర్ధన్ ఏ మేరకు ప్రేక్షకులను అలరించబోతున్నాడో చూడాలి. అమ్రిష్ మనవడిగా వర్ధన్ కు మంచి ఎంట్రీ అయితే దక్కడం ఖాయం. కాని ఆయన నటనతో ఆకట్టుకుంటూ మంచి సినిమాలను చేసినప్పుడే స్టార్ అవ్వగలడు. ప్రతిభ లేకుండా అదృష్టం లేకుండా కేవలం వారసత్వంతో స్టార్స్ అవ్వలేరని పలువురు నటీనటులను చూస్తే ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది. అందుకే వర్ధన్ తాత స్థాయిలో స్టార్ డం ను దక్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.
Please Read Disclaimer