షారూఖ్ కూతురు అనిపించిందిగా..!

0

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ నటనవైపు అడుగులు వేయడం చాలా సాధారణమైన విషయం. స్టార్ హీరోలు తమ పిల్లల్లో అబ్బాయిలను మాత్రమే ప్రోత్సహించి.. అమ్మాయిలను హీరోయిన్లుగా మారకుండా అడ్డుకోరు. ఇప్పటికే చాలామంది స్టార్ కిడ్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కూతురు సుహానా కూడా నటన వైపు అడుగులు వేస్తోంది.

సుహానా సినిమా ఎంట్రీకి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే సుహానా ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో నటనకు సంబంధించిన పాఠాలు నేర్చుకుంటోంది. ఇదిలా ఉంటే ఈమధ్య సుహానా ఒక షార్ట్ ఫిలిం లో నటించింది. ‘ది గ్రే పార్ట్ అఫ్ బ్లూ’ అనే టైటిల్ తో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలిం ఇంగ్లిష్ లో భాషలో ఉంది. సుహానా.. తన బాయ్ ఫ్రెండ్ ను తల్లిదండ్రులకు పరిచయం చెయ్యాలి. అందుకోసం తనతో కలిసి రెండు రోజుల పాటు కారు ప్రయాణం చేస్తూ ఇంటికి వెళ్తుంది. ఆ ప్రయాణంలో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు.. సంభాషణలు ఈ షార్ట్ ఫిలింలో కీలకం.

షార్ట్ ఫిలిం జస్ట్ 10 నిముషాలే ఉంది. అయితే సుహానా నటన.. తన హావభావాలు తప్పకుండా అందరినీ మాయలో పడేస్తాయి. ఎంతో అనుభవం ఉన్న నటి తరహాలో ఎంతో ఈజ్ తో నటించించి. కళ్ళతో భావాలు పలికించిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ లెక్కన సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే దుమ్ముదులపడం ఖాయమే. ఆలస్యం ఎందుకు..ఆ షార్ట్ ఫిలిం చూసేయండి. ఇంగ్లీష్ లో ఉంది కదా.. ఇంగ్లిష్ రాదు అనే మాటను కట్టిపెట్టండి.. ఫ్యూచర్ లో అంతా ఇంగ్లిష్.. ఇంగ్లిష్.. నో టెల్గు!
Please Read Disclaimer