మలైకాపై కుర్ర హీరో స్వచ్ఛమైన ప్రేమ

0

ప్రేమికులు కలిసి లంచ్ లు.. డిన్నర్ లు చేయడం పాత ట్రెండ్. ఈ కాలంలో సహజీవనం అన్నది పరమ రొటీన్. వీటన్నిటినీ మించి తమ మధ్య ఇంకేదో ఉందని చెప్పేందుకు ఆ ప్రేమ జంట తపిస్తోంది. పెళ్లాడతారా? అంటే నోనో అనేస్తూనే.. తమ మధ్య ప్రేమ- అన్యోన్యతకు కొదవేమీ లేదని తమను ఇలానే వదిలెయ్యండని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఎవరీ జంట? అంటే.. మలైకా అరోరాఖాన్ – అర్జున్ కపూర్ జోడీ.

ఆరంభం తమ మధ్య కేవలం స్నేహం మాత్రమేనని అన్నారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడాలు.. విదేశీ షికార్లు.. బర్త్ డే పార్టీలు అంటూ వీళ్లు చేసిన హంగామా మామూలుగా లేదు. ఆ క్రమంలోనే ఇక పెళ్లికి టైమైందని నెటిజనులు భావించారు. కానీ అర్జున్ కపూర్ .. మలైకా దానిని ధృవీకరించలేదు. పెళ్లయిన కుర్రాళ్లకు బట్ట తల వచ్చేస్తుంది? ఆ తర్వాత దానిని పబ్లిక్ కి చూపించాల్సి ఉంటుంది. ఫోటోలకు ఫోజులివ్వాలి.. అది నా వల్ల కాదు అంటూ కుర్ర హీరో అర్జున్ చెణుకులు వేస్తూ సరదాగా పెళ్లి మాటను మాత్రం దాటవేసేస్తున్నాడు. నాకు ఇంకా 33 .. పెళ్లి ఈడు రాలేదు అని జోకులేశాడు. కాఫీ విత్ కరణ్ షోలో మాత్రం తాను సింగిల్ కానే కాదని అంగీకరించాడు. అర్జున్ లో అపరిపక్వత ప్రతిసారీ పబ్లిక్ వేదికలపైనే బయటపడింది.

ఇకపోతే అర్జున్ తో అని పేరు పెట్టకపోయినా ప్రస్తుతం తన లైఫ్ చాలా సంతోషంగా ఉందని తమ మధ్య స్నేహం బాగా కుదిరిందని మలైకా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ క్రమంలోనే ముంబై మీడియా ఈ జంటను వెంటాడి వేధించడంలోనూ ఎక్కడా తగ్గలేదు. తాజాగా మలైకా అరోరాఖాన్ 46వ బర్త్ డే ని ప్రియుడి సమక్షంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రేయసితో కలిసి ప్రియుడు చిందులేశాడు. పార్టీని ఓ రేంజులో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలోనే మలైకాను ప్రియుడు అర్జున్ కపూర్ ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ప్రేమ ముదిరి పిచ్చిగా మారిందంటూ వీటికి కామెంట్లు పడుతున్నాయి. మొత్తానికి ప్రేమలో సిగ్గు విడిచి భయం వదిలేసి ఇప్పటికి ఈ జంట ఓపెన్ అవుతోందంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు.