స్టార్ హీరోయిన్ ని ప్రేమ అంటూ వేధించిన హీరో

0

సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట వారసుడిగా తైమూర్ అప్పుడే పెద్ద వాడు అయిపోతున్నాడు. ఈ ఆదర్శ జంట దాంపత్యం సంతోషంగా సాగుతోంది. సైఫ్- బెబో అటు సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమించడం అందరూ చేస్తారు. కానీ ఆ ప్రేమను పొందగలిగేది కొందరే. అలా జరగాలంటే చాలా ధైర్యం కావాలంటారు. మరి కరీనా- సైఫ్ లవ్ లో ముందుగా డేర్ చేసి ప్రపోజ్ చేసిందెవరు? అంటే సైఫ్ అనే అంటోంది కరీనా. కొన్నేళ్ల పాటు కరీనా వెంట సైఫ్ ప్రేమ ప్రేమ ప్లీజ్ ప్లీజ్! అంటూ వెంటపడ్డాడుట. ఈ జోడీ ప్రేమకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం చాలా గ్యాప్ తర్వాత బయటకు వచ్చింది.

కరీనా ‘తషాన్’ షూటింగ్ లో బిజీగా ఉన్న రోజులవి. ఆ సమయంలోనే సైఫ్ కరీనా వద్దకు వెళ్లి ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సిగ్గు లేకుండా అడిగేసాడట. ఆ తర్వాత లఢక్ (హిమచల్ ప్రదేశ్) లో ఉన్నప్పడు ఇలాగే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడుట. ఆ రెండుసార్లు కరీనా సైఫ్ ని రిజెక్ట్ చేసిందట. తను అలా చేయడానికి కారణం సైఫ్ గురించి సరిగ్గా తెలియకపోవడం వల్లనే అని అంది. చివరికి ఆలోచించి సైఫ్ కి ఎస్ చెప్పిందిట. అదే సమయంలో కొన్ని కండీషన్లు పెట్టానని కరీనా తెలిపింది.

పిల్లలు పుట్టినా వృత్తిని మాత్రం కొనసాగిస్తానని.. ఆవిషయంలో అడ్డు చెప్పవద్దని కరీనా కండీషన్ పెట్టిందిట. అందుకు సైఫ్ నీకు నచ్చినట్లు ఉండొచ్చని.. తాను కానీ.. తన కుటుంబ సభ్యులు కానీ ఆవిషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టరని ప్రామిస్ చేసాడుట. అందుకే సైఫ్ ని పెళ్లి చేసుకున్నానని కరీనా తెలిపింది. ప్రస్తుతం సైఫ్-కరీనా వృత్తి పరంగా ఎవరి బిజీలో వాళ్లు ఉన్నారు.
Please Read Disclaimer