హిట్టొచ్చినా రెమ్యునరేషన్ పెంచలేకపోతున్న హీరో !

0

సాదారణంగా ఓ సినిమా హిట్టయితే ఆ హీరో రెమ్యునరేషన్ పెంచడమనేది కామన్. అయితే శ్రీ విష్ణు మాత్రం తన రెమ్యునరేషన్ పెంచడానికి ఇంకా టైం ఉందంటున్నాడు. ఈ మధ్య విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ చిన్న హీరోల్లో తనకంటూ మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్న ఈ కుర్ర హీరో లేటెస్ట్ గా ‘బ్రోచెవారెవరురా’ తో సూపర్ హిట్ అందుకున్నాడు.

శాటిలైట్ డిజిటల్ తో పాటు థియేట్రికల్ కూడా బాగానే వసూళ్లు చేసిన ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేసాడని అనుకున్నారంత. అయితే అలాంటిదేమీ లేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. బ్రోచేవారెవరురా కంటే ముందే మూడు సినిమాలు కమిట్ అయ్యానని వాటి తర్వాత రెమ్యునరేషన్ పెంచుతానని అన్నాడు.

అయితే ఆ మూడు సినిమాల్లో ఒకటి నారా రోహిత్ తో కలిసి చేస్తున్నానని తెలిపాడు. అది ఓ దేశభక్తితో తెరకెక్కే సినిమా అని ప్రస్తుతం కథ సిద్దమవుతుందని తెలిపాడు. ప్రస్తుతం కమిట్ అయిన ఈ మూడు సినిమాలు కనుక వరుస హిట్స్ అయితే ఇంక అమాంతంగా రెమ్యునరేషణ్ పెంచేస్తాడేమో శ్రీ విష్ణు.
Please Read Disclaimer