డేట్ కోసం వెళ్లిన స్టార్ కపుల్ కు అసౌకర్యం

0

బాలీవుడ్ స్టార్ జోడీ అర్జున్ కపూర్ ఇంకా మలైకా అరోరా గురించి ఎప్పుడు మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీరిద్దరు గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ తో బాహాటంగానే తిరిగేస్తుంది. వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు బయట కూడా అందరికి తెలిసేలా చక్కర్లు కొడుతున్నారు. ఆమద్య ఒక టాక్ షోలో వీరిద్దరు తాము రిలేషన్ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

పెళ్లి విషయమై స్పందించడం లేదు కాని ప్రస్తుతానికి వీరిద్దరు భార్య భర్తల కంటే ఎక్కువగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ కంటే మలైకా అరోరా వయసులో చాలా పెద్దది అయినా కూడా అది వీరిద్దరి ప్రేమకు ఏమాత్రం అడ్డు రాలేదు. ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరు తాజాగా ఒక హోటల్ సిబ్బంది కారణంగా అసౌకర్యంకు గురయ్యారట. హోటల్ లో వసతులపై అర్జున్ కపూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడట.

వివరాల్లోకి వెళ్తే.. అర్జున్ కపూర్ ఇంకా మలైకాలు తాజాగా ఒక హోటల్ కు డేట్ కు వెళ్లారు. ఈవినింగ్ సమయంలో సరదాగా ఎంజాయ్ చేస్తూ డిన్నర్ చేసేందుకు వెళ్లిన ఈ జంటకు అక్కడ ఏసీ పని చేయక పోవడంతో చిర్రెత్తుకు వచ్చిందట. ఏసీ వర్క్ చేయడం లేదనే విషయం సిబ్బందికి చెప్పినా కూడా పట్టించుకోక పోవడంతో అర్జున్ కపూర్ సీరియస్ అయ్యాడట. సిబ్బందిపై అరిచి అక్కడ నుండి మలైకతో బయటకు వెళ్లి పోయినట్లుగా చెబుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-