అటు ఇటు మామ ఏమిటో ఇది అల్లుడా!

0

అటొక మామ.. ఇటొక మామ.. మామల నడుమ మేనల్లుడు.. ఏమిటో ఈ సిత్రం. ఎటు చూసినా మామయ్యల హడావుడే. ఇక మామలంటే మేనల్లుడికి ఉండే ప్రేమ గురించి.. అల్లుడు అంటే మామల కు ఉండే ప్రేమల గురించి చెప్పాలా? మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీని హిట్టు చేసే బాధ్యత ఆ ఇద్దరిదే కదా!

ఏదైతేనేం… మేనల్లుడు ఇలా మామల పోస్టర్ల ముందు కూచూని మాస్ అభిమానుల్ని టచ్ చేశాడు. అన్నయ్య తమ్ముడు ఇద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తనవైపు తిప్పేసుకుంటూ అల్లుడు బాగానే స్పీడ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉప్పెన పోస్టర్లు.. లిరికల్ సాంగ్స్ కి స్పందన బావుంది. ధాక్ ధాక్ ధక్ అంటూ దేవీశ్రీ ఇచ్చిన ట్యూన్ ఇటీవల వైరల్ అయ్యింది. విజువలైజేషన్ ఆకట్టుకుంది. ఇక సుక్కూ బ్రాండ్ స్క్రిప్టుని ఆయన శిష్యుడే అయిన బుచ్చిబాబు ఎలా తెరకెక్కించారో చూడాలి.

ఈ చిత్రంలో కథానాయికగా నటించిన కృతి శెట్టి క్యూట్ లుక్ కుర్రకారులో గిలిగింతలు పెట్టేస్తోంది. ఇక ఈ పరీక్షల సీజన్ ముగింపులో వస్తున్నారు కాబట్టి స్కూల్- కాలేజ్ విద్యార్థులు థియేటర్లకు క్యూకడతారా? మత్స్యకారుడి ప్రేమలో పడిన మోతుబరి గాళ్ కి ఫిదా అయ్యి జనం కదిలొస్తారా? అన్నది చూడాలి.

వైష్ణవ్ తేజ్ ఒక సెలూన్లో కూర్చుని ఉండగా.. దుకాణం రెండు తలుపులపైనా చిరంజీవి – పవన్ కళ్యాణ్ పోస్టర్లు ముద్రించి ఉన్న ఈ ఫోటో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ చిత్రానికి తొలి నుంచి మెగాస్టార్ సపోర్ట్ తో పాటు పవన్ అండా ఉందన్న టాక్ ఉంది. ఏప్రిల్ 2 న సినిమా విడుదలవుతోంది. ప్రివ్యూల నుంచి తొలి రివ్యూ ఎలా ఉండనుందో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-