రియల్ హీరో ఇతడే.. ప్రాణాలకు తెగించాడు..

0

సినిమాల్లో జనాలను కాపాడిన హీరో చూశాం.. కానీ రియల్ హీరోను చూశారా.? గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లో ప్రాణాలు తెగించి యువతులను కాపాడి రియల్ హీరోగా మారాడు యువకుడు కేతన్ జొరవాడియా.. ఇతడు ప్రాణాలు ఫణంగా పెట్టి చూపించిన తెగువ ధైర్యసాహసాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సూరత్ నగరంలోని ఓ కోచింగ్ సెంటర్ లో 4 అంతస్తుల వాణిజ్యంలో మంటలు వ్యాపించాయి. దీంతో చాలా మంది విద్యార్థులు ఎగిసిన మంటలకు బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. కొందరు పొగకు ఊపిరాడక చనిపోయారు. అయితే ప్రమాద సమయంలో కేతన్ జొరవాడియా అనే యువకుడు బిల్డింగ్ పైకి ఎక్కి యువతులను కాపాడేందుకు ప్రయత్నించాడు. పలువురిని కాపాడాడు కూడా.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కేతన్ ను సెలెబ్రెటీలు ప్రముఖులు సాధారణ ప్రజలు రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు.

మంటలకు ప్రాణాలు కాపాడుకోవడానికి యువతులు బిల్డింగ్ పై నుంచి ప్రాణాలు కోల్పోతున్న దృష్యాన్ని చూసిన కేతన్.. వెంటనే గోడపైకి ఎక్కి బిల్డింగ్ మీదకు చేరుకొని యువతులకు సాయం చేసి పై నుంచి కిందకు వారిని క్షేమంగా కిందకు దించాడు. మాజీ క్రికెటర్ లక్ష్మణ్ మేజర్ పూనియా కూడా కేతన్ చూపించిన ధైర్య సాహసాల వీడియోను షేర్ చేసి ప్రశంసించాడు.

కాగా గుజరాత్ ప్రభుత్వం చనిపోయిన విద్యార్థులకు 4 లక్షల చొప్పున ఆర్థికసాయం చేసింది. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. భవనం కింది అంతస్తులో మొదట మంటలు చెలరేగాయని.. ఆ తర్వాత పైకి ఎగబాకాయని గుర్తించారు. విద్యార్థులు తప్పించుకునేందుకు మార్గం లేకే దూకి చనిపోయారని అధికారులు తెలిపారు.