ఆ స్టార్ హీరోపై వచ్చిన పుకారు నిజమేనంట..!

0

సినీ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవుండదు. హీరోయిన్ల ఎఫైర్ల దగ్గర నుండి అగ్ర హీరోల సినిమాల వరకు ప్రతీ విషయం సినీ ప్రేక్షకులకు ఆసక్తికరమైన అంశమే. కొందరు స్టోరీలను తెలుసుకొని గాసిప్స్ గా రాసేస్తారు. మరికొందరు అదేపనిగా దాన్ని నిజం చేయడానికి ట్రై చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ పుకారే నిజమైన సంఘటనలు సినీ ఇండస్ట్రీలో కోకొల్లలు. మన టాలీవుడ్ లో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే రీసెంట్ గా ఇలానే ఒక పుకారు పుట్టుకొచ్చింది. అదేంటంటే టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో ఈ మధ్య లైఫ్ లైన్ లోకి వచ్చిన దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు న్యూస్ బయటకి వచ్చింది. ఆ దర్శకుడు ఇటీవల ఒక యంగ్ హీరోతో తీసిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ స్టార్ హీరో పిలిచిమరీ తన కోసం స్టోరీ సిద్ధం చేయమని డైరెక్టర్ కి చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయం ఆ బడా హీరో చెవిన పడటం తో ఇదంతా పుకారేనని ఆ వార్త నిజం కాదని ఖండించారు.

వాస్తవానికి ఈ పుకారు నిజమేనని ఇండస్ట్రీలో పలువురు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆ స్టార్ హీరో భార్య స్వయంగా ఆ దర్శకుడికి ఫోన్ చేసి ఇటీవల రిలీజైన చిత్రం విజయవంతమైనందుకు అభినందించిందంట. ఈ సందర్భంగా ఆ స్టార్ హీరో కోసం హీరోయిజం ఉండే కథ ఒకటి సిద్ధం చేయమని అడిగిందంట. ఆ స్టార్ హీరో తో నటించిన యువ నటి వీరిద్దరికి మీడియేటర్ గా వ్యవహరించారంట. వాళ్లే గాసిప్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్లే ఆ గాసిప్ వేరే ఎవరో క్రియేట్ చేసారు అని చెప్పడం విని ఇండస్ట్రీలో రకరకాలుగా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా పుకార్లను సృష్టించడం లో అందరూ ఒకే తల్లి బిడ్డలమని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారంట. అయినా కథ లో దమ్ముంటే చిన్న డైరెక్టర్ ఏంటి పెద్ద డైరెక్టర్ ఏంటి. తీసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్స్ ఎంతమంది లేరు చెప్పండి.
Please Read Disclaimer