Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఏజ్ ని కొంచెం దాచాలేమో భూమిక మ్యాడమ్?

ఏజ్ ని కొంచెం దాచాలేమో భూమిక మ్యాడమ్?


ఎంతగా సీనియర్లు అయినా కానీ ఇంకా ఏజ్ ని ఎక్కడా బయటపడకుండా కాపాడుకోవడంలో మన సీనియర్ బామామణుల ట్యాలెంట్ ని పొగిడి తీరాల్సిందే. ఏఎన్నార్ కాలం నాటి శుభ ఇప్పటికీ తన నిత్యయవ్వన రూపాన్ని కాపాడుకోవడం చర్చకు వస్తుంటుంది. ఇక నదియా లాంటి సీనియర్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక వేవ్ నే సృష్టించారంటే అంతగా అందంతో కవ్వించడం వల్లనే. మాయావి త్రివిక్రమ్ వరుసగా తన సినిమాల్లో అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు నదియాను. ఇక మలైకా లాంటి బ్యూటీ ఏజ్ తెలిసిపోయినా ఇటీవల దానిని దాచేసే రేంజులో యోగా జిమ్ తో రివర్స్ బ్యాక్ అయ్యి సర్ ప్రైజ్ చేస్తోంది.

శ్రీదేవి.. జయప్రద వంటి వెటరన్స్ కూడా చాలాకాలం ఏజ్ ని దాచేసే అమృతకలశం సంపాదించుకున్నా.. చివరిలో బయటపడిపోయారు. రోహిణి.. మధుబాల వంటి నటీమణులు ఏజ్ ని దాచలేక చతికిలబడ్డారు. ఇదిగో ఇప్పుడు అదే బాటలో మరో సీనియర్ బ్యూటీ చేరుతోంది. నదియాలా బయటపడకుండా కాపాడుకునే మంత్రాంగం తెలియకనో ఏమిటో కానీ ఇటీవల అందాల భూమిక ఏజ్ ఇట్టే తెలిసిపోతోంది.

లేటెస్ట్ ఫోటోషూట్లు పరిశీలిస్తే ఏజ్ బయటపడిపోతోందిగా అంటూ బోయ్స్ అప్పుడే కామెంట్లు మొదలెట్టేశారు. భూమిక ఏజ్ ఇప్పుడు 42 … మెయిన్ స్ట్రీమ్ కథానాయికగా ఛాన్సుల్లేక క్యారెక్టర్లు చేస్తూ బండి నెట్టుకొస్తున్న సంగతి తెలిసినదే. ఎపుడో సల్మాన్ ఖాన్ సరసన నటించిన భూమిక అటుపై సుమంత్ సరసన యువకుడు అనే చిత్రంలో నటించింది. తొలి ప్రయత్నమే భూమిక కవ్వింతకు తెలుగు యూత్ ఫిదా అయిపోయారు. అటుపై ఖుషీ సినిమాతో భూమిక ఫేవరెట్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత కెరీర్ తెలిసినదే. అయితే ఎంత క్రేజీ హీరోయిన్ కి అయినా ఈ పరిస్థితి తప్పనిది. అయితేనేం ఈ ఏజ్ లో కూడా తన స్థాయికి హుందాతనానికి తగ్గ పాత్రల్ని ఎంచుకోవడం మెచ్చదగినది.

ప్రస్తుతం భూమిక అక్కినేని కాంపౌండ్ సినిమాల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సహజ నటి భూమికా చావ్లా గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ లో ఓ మూవీకి సంతకం చేశారు. ఇప్పటికే చిత్రీకరణలో చేరారట. ఎం.ఎస్.రాజు వారసుడు సుమంత్ అస్విన్ కథానాయకుడిగా.. యంగ్ బ్యూటీ తాన్యహోప్ కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. శ్రీకాంత్ ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. జీపీ ప్రొడక్షన్స్ 7లో మహేష్ నిర్మిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జునైద్ ఎడిటింగ్ చేయనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు. గురు దేపురు ఈ చిత్రానికి రచయిత.