పోటీ హీరో సినిమాను సీక్రెట్ గా చూసిన స్టార్ హీరో

0

టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలు తమ సినిమాలనే అసలు చూసుకోరు. కొందరేమో నాన్నగారి సినిమాలనే మాటిమాటికీ చూస్తారు. అయితే కొందరు మాత్రం పక్కవారి సినిమాలను చూస్తారు.. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు తెలుపుతారు. మంచి సినిమాలను మెచ్చుకుంటారు. సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే సంక్రాంతి హీరోలు మాత్రం పోటీలో రిలీజ్ అయిన ఇతర సినిమాలపై ఇంతవరకూ అభిప్రాయం తెలుపలేదు.

అసలు సంక్రాంతి హీరోలు పోటీలో ఉన్న మరో స్టార్ హీరో సినిమాను చూశారా లేదా అనేది చాలామందికి అనుమానం. అయితే ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్న ఒక స్టార్ హీరో తన కుటుంబ సభ్యులతో కలిసి మరో స్టార్ హీరో సినిమాను న్యూయార్క్ నగరంలో వీక్షించారని సమాచారం. పోటీ సినిమా అయినప్పటికీ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేశారట. అందులో కొన్ని సీన్లు చాలా నచ్చాయట. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో స్పందిస్తారా లేదా అనేది మాత్రం అనుమానమే.

స్టార్ హీరోలు ఎవరైనా సక్సెస్ ఇస్తారనే నమ్మకం ఉండే దర్శకులతో పనిచేసేందుకే మొగ్గుచూపుతారు. ఈలెక్కన ఈ స్టార్ హీరో ఆ దర్శకుడితో పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. ఏదేమైనా సంక్రాంతి సీజన్ సినిమాల పోటీ పూర్తయింది కాబట్టి పోటీ విషయాన్ని పక్కన పెట్టేసినట్టే.
Please Read Disclaimer