న్యాచురల్ స్టార్ ముక్కు గాయం.. అది సంగతి!

0

న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’ ఏప్రిల్ 19 న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని ఒక మధ్యవయస్కుడైన క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాని ముక్కుకు ఒక చిన్న గాయం అయిందని జనవరి 28 వ తారీఖున వార్తలు వచ్చాయి. గాయం చిన్నదేనని.. కంగారు పడాల్సిన అవసరం లేదని అప్పట్లో చెప్పారు.

తాజాగా ఈ గాయానికి సంబంధించిన మరికొన్ని వివరాలు బయటకు వచ్చాయి. నాని మరో ఇంటర్నేషనల్ టీమ్ తో మ్యాచ్ ఆడే సమయంలో ఒక రన్ అవుట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఆ సీన్ లో వేగంగా పరిగెత్తి క్రీజ్ కు చేరే తొందరలో అవతలి టీమ్ వికెట్ కీపర్ ను ఢీకొట్టాడట.. అప్పుడే ఈ గాయం అయిందట. ఈ సీన్ ను సినిమాలో ఉంచుతున్నారని సమాచారం. గాయమైన మరుసటి రోజే నాని షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ గాయం మానకమునుపే నాని ఎలా షూటింగ్ లో పాల్గొన్నాడు? అని మీకెవరికైనా అనుమానం వచ్చిందంటే.. దానికి సమాధానం ‘మేకప్’. మేకప్ తో చక్కగా ఆ గాయాన్ని కవర్ చేశారట. మరి సినిమాలో ఆ గాయం అయ్యే సీన్ ఎలా ఉందో సినిమా చూస్తే కానీ మనకు తెలియదు.

ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ద్వారా గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ.. పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer