పాత గర్ల్ ఫ్రెండ్ కు ఆఫర్ ఇప్పించిన యువ హీరో!

0

ఫిలిం ఇండస్ట్రీ లో టాలెంట్ తో మాత్రమే అవకాశాలు వస్తాయి అనుకుంటే అంతకంటే పొరపాటు అభిప్రాయం మరొకటి ఉండదు. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రానివారు చాలా మందే ఉంటారు. అందుకే పరిచయాలు.. ఫ్రెండ్స్ సర్కిల్ ఉండడం చాలా ముఖ్యం. ఒక్కోసారి అవకాశాలు లేని పరిస్థితి వస్తే అప్పుడు మనకు తెలిసినవారు.. స్నిహితులు తప్ప ఇతరుల నుండి అవకాశాలు రావు. రీసెంట్ గా ఒక హీరోయిన్ విషయంలో అలానే జరిగిందని టాక్.

ఈ భామ చాలా కాలం క్రితమే.. బోల్డ్ అనే పదానికి జనాలు ఇంకా అలవాటుపడని కాలంలోనే బోల్డ్ భామ టాగ్ సాధించింది. మొదట్లో కొన్ని హిట్లతో జోరుమీద ఉన్నప్పటికీ తర్వాత వరస ఫ్లాపులు ఈ భామ కెరీర్ ని దెబ్బకొట్టాయి. ఇప్పుడు దాదాపుగా హీరోయిన్ అవకాశాలు లేవు. అందుకే సెకండ్ హీరోయిన్ పాత్రల కోసం ట్రై చేస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగా ఒక యువహీరో ను సంప్రదించడం.. ఆ హీరో తన నెక్స్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇప్పించడం చకచకా జరిగిపోయాయి. వీరిద్దరి మధ్యలో అప్పట్లో ఓ ఘాటు లవ్ ఎఫైర్ ఉండేదని టాక్ ఉంది. దీంతో పాత ప్రియురాలికి హీరో అవకాశం ఇచ్చాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు అవకాశాలు లేకుండా ఉండేకంటే ఏదో ఒక ఆఫర్ చేతిలో ఉండడం మేలే కదా. అంతే కాకుండా మరో సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ కెరీర్లో మళ్ళీ బిజీ అవుతోందని అంటున్నారు. చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే ఆటోమేటిక్ గా కొత్త ఆఫర్లు వస్తాయి కాబట్టి ఆ భామ ఇప్పుడు తెగ సంతోషం గా ఉందట.

Comments are closed.